హిందూపురం: హ్యాట్రిక్ సాధించిన బాలయ్య.. ఎదురేలేదు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని గత నెల 13వ తేదీ జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజున వెలువడ్డాయి.. టిడిపి పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.. వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం మొదటి నుంచి టఫ్ గా ఉంటుందంటూ వార్తలు వినిపించాయి. కానీ బాలకృష్ణ ఇక్కడ గెలవడం చాలా సులువుగా మారిపోయింది.. వైసిపి పార్టీ ఎన్నో ప్రణాళికలు వేసి దీపికాను నిలబెట్టినప్పటికీ ఆమె గెలవలేకపోయింది.. దీంతో బాలయ్య ఈసారి హ్యాట్రిక్ విజయాన్ని సులువుగా అందుకున్నారు.
దాదాపుగా దీపిక మీద 32, 597 ఓట్ల మెజారిటీతో బాలయ్య గెలవడం జరిగింది.. దీంతో టిడిపి పార్టీ అభ్యర్ధి హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.. ఈ విజయాన్ని ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ నేతలు,  టిడిపి పార్టీ నేతలు సైతం సంబరాలు జరుపుకుంటున్నారు. వాస్తవానికి గతంలో నుంచి బాలయ్య ఎన్నో మంచి పనులు చేశారని..  అక్కడ ఓడిపోవడం సర్వ సాధారణమైనప్పటికీ వైసీపీకి ఉన్న వేవ్ వల్ల బాలయ్య ఓడిపోతారని అందరూ అనుకున్నారు.

కానీ తీరా చూస్తే వైసిపి పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా ఘోరమైన పరిస్థితిలో ఓడిపోయింది. 175 స్థానాలకు గాను కేవలం పది స్థానాల్లో మాత్రమే వైసిపి విజయం సాధించింది.. ఇక్కడ కూటమి కనివిని ఎరుగని రేతిలో చరిత్ర తిరగరాసిందని చెప్పవచ్చు. ఇకపోతే 2014 ఎన్నికలలో హిందూపురం తరుపున పోటీ చేసిన బాలయ్య భారీ విజయాన్ని అందుకోగా.. ఇక్కడ ఏకంగా 16,196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు 2019లో శాసనసభ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన బాలయ్య 18,028 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక ఇప్పుడు కూడా 32, 597 ఓట్ల మెజారిటీతో 2024 ఎన్నికల్లో కూడా గెలిచి ఏకంగా హ్యాట్రిక్ అందుకున్నారు. హ్యాట్రిక్ అందుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న తొలి సెలెబ్రిటీగా రికార్డు సృష్టించనున్నారు బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: