జగన్, వైసీపీ నాకు శత్రువులు కాదు.. ఆ విషయాల్లో పవన్ పూర్తి క్లారిటీ ఇచ్చేశారుగా!

Divya
జనసేన పార్టీ నుంచి కూటమితో పొత్తు పెట్టుకుని పిఠాపురం ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ 69,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ముఖ్యంగా 21 స్థానాలలో పోటీ చేయగా 21 స్థానాలలో కూడా గెలుపొంది అందరిని ఆశ్చర్యపరిచారు 100% మెజారిటీతో మొదటిసారి రికార్డు సృష్టించారు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన ఈయన వైసిపి మిత్రులు జగన్ గారు తనకు శత్రువులు కాదు అని ఈ విషయాలపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు
ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ ఘనవిజయంతో వైసిపిని భవిష్యత్తులో తాము ఎప్పుడు ఇబ్బంది పెట్టము.. ఐదు కోట్ల మంది ఏపీ ప్రజల కోసం పనిచేస్తాము.. ఇది నా జీవితంలో ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము.. ఈ అధికారం కక్ష సాధింపు కోసం ఉపయోగించను ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగిస్తాను అంటూ ప్రెస్మీట్లో పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఇక పిఠాపురంలో వైసిపి అభ్యర్థి వంగా గీత   పై పోటీ చేసి అత్యంత మెజారిటీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్.. ముఖ్యంగా ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని... అసలు వైసీపీ పై ఎటువంటి కక్ష సాధింపులు చేయము అంటూ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్..గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు..  ఇంకా భయం వేస్తోంది అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటే నాకు భయం వేస్తుంది ...ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారు ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదు.. ఈ ఐదేళ్ల పాలనలో నా బాధ్యతను నెరవేర్చుకొని నిరూపిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు మరి ఈరోజు గెలుపు ఆనందంలో చెప్పిన మాటలు ఈ ఐదేళ్ల పరిపాలనలో పవన్ కళ్యాణ్ నిజం చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: