పీలేరు పోరులో విజేత ఇతనే.. నల్లారి వర్సెస్ చింతల పోరులో సత్తా చాటిందెవరంటే?
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైన తర్వాత భారీ సంఖ్యలో గెలుపునకు సంబంధించి బెట్టింగ్ జరిగిన నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి కావడం గమనార్హం. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి గత ఎన్నికల్లో చేదు ఫలితం ఎదురు కాగా ఈ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా సత్తా చాటాలని నియోజకవర్గంలో గెలుపు కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. నల్లారి వర్సెస్ చింతల పోరులో కిషోర్ కుమార్ రెడ్డి సత్తా చాటారు.
పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత టీడీపీ జెండా ఎగురవేయడం గమనార్హం. 1994 సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో జీవీ శ్రీనాథ్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇతర పార్టీలు విజయం సాధించాయే తప్ప టీడీపీ విజయం సాధించలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆ లెక్కను మార్చేశారు.
నియోజకవర్గంలో చింతల రాంచంద్రారెడ్డి హ్యాట్రిక్ పై కన్నేయగా ఆయన హ్యాట్రిక్ కు కిషోర్ కుమార్ రెడ్డి గండి కొట్టడం గమనార్హం. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాంచంద్రారెడ్డి గెలవడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. చింతల రాంచంద్రారెడ్డి పాలనలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్లే పీలేరు ప్రజలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పీలేరు ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని నల్లారి కిషోర్ రెడ్డి సరైన రీతిలో వినియోగించుకుంటే మాత్రం ఆయనకు ఎన్నికల్లో తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.