అమలాపురం ఎంపీ: అద్గది మన బాలయోగి కొడుకు హరీష్ అదరగొట్టి ఎంపీ అయ్యిండు..!
అమలాపురం పార్లమెంటు పరిధిలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు ఈ మూడు ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్లతో పాటు కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం జనరల్ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా చాలా బలంగా ఉంది. అలాగే బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గం కూడా రాజకీయంగా పట్టు కోసం ప్రయత్నిస్తోంది. అలాగే పార్లమెంటు పరిధిలో ఎస్సీ సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గం ఓటర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. మూడు ఎస్సీ సెగ్మెంట్లు వదిలేస్తే నాలుగు జనరల్ స్తానాల్లో కూటమి ఒక శెట్టిబలిజ, ఒక కాపు, ఒక క్షత్రియ, ఒక కమ్మకు సీట్లు కేటాయించింది.
ఇక వైసీపీ ఒక రెడ్డి, ఒక శెట్టిబలిజ, ఒక మత్స్యకార, ఒక కాపుకు సీట్లు ఇచ్చింది. ఎన్నికల హడావుడి ప్రారంభం కావడానికి ముందు నామినేషన్ల పర్వం.. ప్రచారం, పోలింగ్ ముగిశాక ఎలా చూసుకున్న బాలయోగి తనయుడు ఏకంగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు అన్న అంచనాలు, నివేదికలే ఎక్కువగా వినిపించాయి అయితే ఈరోజు జరిగిన కౌంటింగ్ లో హరీష్ ఏకంగా 2 లక్షల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అలా తన తండ్రి స్పీకర్ పనిచేసిన లోక్సభలో ఈ రోజు హరీష్ ఎంపీ గా అడుగు పెట్టబోతున్నాడు.