అభ్యర్థి మారినా ఆలూరు లెక్క మారలేదుగా... ఆ అభ్యర్థే ఎన్నికల్లో సత్తా చాటారా?

Reddy P Rajasekhar
2024 ఎన్నికల్లో ఏపీలో హాట్ టాపిక్ అయిన నియోజకవర్గాలలో ఆలూరు ఒకటని చెప్పడంలో సందేహం అస్సలు అవసరం లేదు. వైసీపీ ఈ నియోజకవర్గం గత ఎన్నికల్లో గెలిచిన గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరడం వైసీపీపై విమర్శలు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఆలూరు వైసీపీ టికెట్ విరూపాక్షికి దక్కగా కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ బరిలో నిలిచారు.
 
విరూపాక్షి, వీరభద్ర గౌడ్ లలో ఆలూరు ఓటర్లు ఎటువైపు అంటూ సోషల్ మీడియా వేదికగా, వెబ్ మీడియా వేదికగా జోరుగా చర్చలు జరిగాయి. వైసీపీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విరూపాక్షి టీడీపీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వీరభద్ర గౌడ్ ఎంతో కష్టపడ్డారు. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని వెల్లడించడం జరిగింది.
 
ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన విరూపాక్షి విజయం సాధించగా వీరభద్ర గౌడ్ కు మాత్రం ఆశించిన ఫలితం అయితే రాలేదు. గుమ్మనూరు జయరాంకు బదులుగా ఈ నియోజకవర్గంలో విరూపాక్షికి వైసీపీ టికెట్ ఇవ్వగా టికెట్ విషయంలో వైసీపీ నమ్మకాన్ని విరూపాక్షి నిలబెట్టుకున్నారనే చెప్పాలి కర్నూలు జిల్లాలో పరిమిత సంఖ్యలో స్థానాల్లో మాత్రమే వైసీపీ సత్తా చాటింది.
 
అయితే వైసీపీ సత్తా చాటిన నియోజకవర్గాల్లో ఆలూరు ఒకటిగా వైసీపీ నేతల సంబరాలకు మాత్రం అవధులు లేకుండా పోయాయి. ఆలూరులో కచ్చితంగా విజయం సాధిస్తానని చాలా సందర్భాల్లో వెల్లడించిన ఎట్టకేలకు విజయం సాధించి వార్తల్లో నిలిచారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆలూరులో వైసీపీ జెండ ఎగురవేయడం జగన్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ విజయంతో జిల్లాలో వైసీపీని అభిమానించే అభిమానులు ఎక్కువగానే ఉన్నారని ప్రూవ్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: