ప్రత్యేక హోదా డిమాండ్ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా?

Veldandi Saikiran
భారతదేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విధంగా వచ్చాయి. అయోధ్య రామ మందిరం కట్టడం, కేజ్రీవాల్ ను జైల్లో వేయడం, ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టడం, ఇటు హిందూ సమాజాన్ని తమ వైపునకు తిప్పుకోవడంలో గత ఐదు సంవత్సరాలలో సక్సెస్ అయింది బిజెపి పార్టీ. ఈ నేపథ్యంలోనే సర్వే సంస్థలు కూడా బిజెపి పార్టీకి 300 సీట్లకు పైగా వస్తాయని అంచనా వేశారు. nda కూటమితో కలిసి... బిజెపికి 350 నుంచి 400 మధ్య సీట్లు వస్తాయని సర్వే సంస్థలు కూడా స్పష్టం చేశాయి.
 కానీ సీను చివరికి రివర్స్ అయింది.  ఎన్డీఏ కూటమి 292 సీట్ల దగ్గరే ఆగిపోయేలా కనిపిస్తోంది. అటు ఇండియా కూటమి మాత్రం 236 సీట్ల వరకు వచ్చేసింది. అంటే ఇండియా కూటమి ఇలా పుంజుకోవడం మామూలు ముచ్చట కాదు. ఇది అతి పెద్ద విజయం అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా... ఇంత స్థాయిలో సీతను సంపాదించడం గ్రేట్. అయితే ఈ నేపథ్యంలో... ఎన్డీఏ మిత్రపక్షాలను తమ వైపునకు  లాక్కునేందుకు... ఇండియా కూటమి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోందట.
 నారా చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ లాంటి కీలక నేతలకు ఆఫర్లు కూడా ఇచ్చేస్తుందట. అయితే వారు రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేయడం కూడా మొదలు పెట్టింది కాంగ్రెస్. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత జయరాం రమేష్... తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అలాగే జనసేనతో జట్టు కట్టి భారీ విజయాన్ని అందుకున్న చంద్రబాబుకు జైరామ్ రమేష్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం లోని  ఎన్డీఏ కు మద్దతు ఇవ్వాలంటే ముందస్తు షరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసే ధైర్యం నీకు ఉందా అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంత ధైర్యం చంద్రబాబుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు.  ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తారని... సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువస్తుంది కాంగ్రెస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: