అమెరికాకు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌ పారిపోయాడా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంకు గతంలో వ్యతిరేకంగా పనిచేసిన... సేఫ్టీ ప్లేస్ వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో... చాలామంది ప్రభుత్వ అధికారులు... రాజకీయ నాయకుల్లాగే ప్రవర్తించారని ఏపీలో టాక్ ఉంది. అయితే అలాంటి నేతలు ఇప్పుడు అందరూ అలాంటి అవుతున్నారట.

 
ఇలాంటి నేపథ్యంలోనే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి చీఫ్ సంజయ్... కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అమెరికాకు పయనం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సంజయ్...  నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెలవు అప్లై చేశారట. బుధవారం రోజు నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు... అంటే దాదాపు నెలరోజుల పాటు ఏపీని వదిలి అమెరికాకు పయనం కానున్నారట  ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సంజయ్ కుమార్.


 కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల... తన ఉద్యోగానికి నెల రోజులపాటు సెలవులు పెడుతున్నానని..  సెలవు పెట్టి నేరుగా అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కి దరఖాస్తు చేసుకున్నారు ఏపీ సిఐడి చీఫ్ సంజయ్. దరఖాస్తు రాగానే వెంటనే ఆ సెలవులకు మంజూరు తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు సి ఎస్ జవహర్ రెడ్డి.

 
ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే... ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సంజయ్ విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో... ఆయన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ డిజిపి కి అప్పగించారు జవహర్ రెడ్డి. అయితే... తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సంజయ్ విదేశాలకు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ ఐన సమయంలో సంజయ్ అలాగే పొన్నవోలు వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టి.. టిడిపిని టార్గెట్ చేశారు. జగన్ చెప్పిన డైరెక్షన్ లో నడుచుకున్నారు. అయితే ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో... ఏపీ సిఐడి సంజయ్ విదేశాలకు వెళ్లడంతో.. కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: