జగన్ పాలన గుట్టు విప్పిన బాబు.. ఇంత ఘోరంగా కరెంట్ ఛార్జీలు పెంచేశారా?

Pulgam Srinivas
మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , టిడిపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగగా , వై సీ పీ ఒంటరిగా పోటీలోకి దిగింది. ఇక మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి. అందులో కూటమి అదిరిపోయే రేంజ్ విక్టరీని సాధించింది. ఇక జనసేన అయితే 100% విజయాన్ని అందుకుంది. ఈ పార్టీ 21 అసెంబ్లీ , రెండు పార్లమెంటు స్థానాలలో పొత్తులో భాగంగా తీసుకోగా 21 అసెంబ్లీ స్థానాలలో గెలిచింది.

రెండు పార్లమెంటు స్థానాలలో గెలిచింది. ఇకపోతే భారీ విక్టరీని సాధించడంతో చంద్రబాబు నాయుడు తాజాగా మీడియాతో ముచ్చటించారు. అందులో భాగంగా గత ప్రభుత్వం చేసిన దారుణాల గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ... ప్రజలు మాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇది ఒక సూపర్ మెజారిటీ విజయం. ఇకపోతే గత ప్రభుత్వం ఏమి తప్పులు చేసిందో అవన్నీటిని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. వారు ఎక్కడ ఎన్ని అప్పులు చేశారో కూడా ఇంకా తెలియదు. వాటి అన్నింటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక మేము ఉన్నప్పుడు కరెంటు గురించి ఎంతో పని చేశాం. కానీ మా ప్రభుత్వం పోయి పక్క ప్రభుత్వం వచ్చాక కరెంటు పై పని చేయడం ఆపేశారు. అలాగే సరైన విద్యుత్ ఇవ్వకుండా కరెంటు చార్జీలను ఐదు సంవత్సరాలలో ఏకంగా ఎనిమిది సార్లు పెంచేశారు. ఇక మేము మళ్ళీ వచ్చాము కరెంటు ని మళ్ళీ పునరుద్ధరించి ప్రజలకు మంచి కరెంటును ఇస్తాం అని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన తాజాగా గొప్పగా మాట్లాడారు. పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో మాతో పొట్టు పెట్టుకున్నారు. అలాగే బి జె పి ని కూడా మాతో కలిపారు అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: