ఏపీలో మంత్రి పదవులు దక్కేది వీళ్లకే..జిల్లాల వారిగా లెక్కలు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. 164 స్థానాలు సంపాదించుకున్న తెలుగుదేశం కూటమి... ఈనెల 12వ తేదీన... ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదే రోజున చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న... నేతల్లో ఎవరికి మంత్రి పదవి వస్తుందని చాలామంది లెక్కలేసుకుంటున్నారు.
ఏపీలో...తెలుగుదేశం, జనసేన అటు బీజేపీ పార్టీలలో  ఉన్న కీలక నేతలందరూ మంత్రి పదవిలను దక్కించుకుంటారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, బీసీ బ్యాగ్రౌండ్ , కాపు సామాజిక వర్గాలను  లెక్కలేసుకొని కేబినెట్ పదవులు ఇచ్చి ఎందుకు చంద్రబాబు సిద్ధమయ్యారట. అయితే ప్రస్తుతం.. కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.
శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకసారి పరిశీలిస్తే.. కలింగ  సామాజిక వర్గ నేత పూన రవికుమార్, టెక్కలి నుంచి అచ్చం నాయుడు రంగంలో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా అచ్చం నాయుడుకు మంత్రి పదవి రావడం గ్యారెంటీ. విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు, గుమ్మడి సంధ్యారాణి పేర్లు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో.. పవన్ కళ్యాణ్ అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయి.
విశాఖ జిల్లాలో అనిత, కొణతాల రామకృష్ణ  పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణం రాజు లకు కచ్చితంగా మొదటి పదవులు వస్తాయని సమాచారం. గుంటూరు జిల్లా నుంచి...  నాదెండ్ల మనోహర్ కు పదవి గ్యారెంటీ అంటున్నారు. కృష్ణాజిల్లాలో... కొల్లు రవీంద్ర కు  మంత్రి పదవి రావడం గ్యారంటీ అని జోరుగా ప్రచారం జరుగుతుంది. నెల్లూరు జిల్లా నుంచి... నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నాయట. అనంతపూర్ జిల్లా నుంచి పయ్యావుల కేశవ్ కు కచ్చితంగా వస్తుంది అని చెబుతున్నారు. కర్నూలు జిల్లా నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, కడప జిల్లా నుంచి మాధవి రెడ్డికి పదవి వచ్చే ఛాన్స్ కు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: