బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ : తీన్మార్ మల్లన్నను దెబ్బ కొడుతున్న చెల్లని ఓట్లు ?
బుధవారం ఉదయం నుంచి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తి అయ్యాయి. ఈ రెండు రౌండ్లలోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లీడింగ్ లో కనిపించారు. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం... మొదటి రౌండులో 7670 ఓట్ల ఆదిక్యం సంపాదించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఇక రెండో రౌండ్లో కూడా ఆయన లీడ్ లో కొనసాగడం విశేషం. అయితే మొదటి రౌండ్ కంటే రెండో రౌండ్లో... తీన్మార్ మల్లన్నకు లీడ్ తక్కువ వచ్చిందని చెబుతున్నారు అధికారులు.
రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి... 14672 ఓట్లు ఆదిత్యంలో తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఈ రౌండ్లో ఆయనకు 34,575 ఓట్లు రావడం జరిగింది. అయితే తీన్మార్ మల్లన్నకు గట్టి పోటీ ఇస్తున్నారు గులాబీ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. ఆయనకు ఇప్పటివరకు... 27,573 ఓట్లు వచ్చాయి. అటు బిజెపి పార్టీ తరఫున రంగంలో దిగిన ప్రేమను రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అయిన.. అశోక్ అనే వ్యక్తికి రెండో రౌండ్లో... 11 వేల ఓట్లు వచ్చాయి.
అయితే ఈ ఉప ఎన్నికల్లో... చెల్లని ఓట్లు బాగా వస్తున్నాయట. తీన్మార్ మల్లన్నకు వేసిన వారు చాలా మంది... చెల్లిని ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. కొంత మంది జై మల్లన్న అంటూ రాసి మరీ ఓటు వేశారట. దీంతో తీన్మార్ మల్లన్నకు వేసిన ఓట్లు చాలా వరకు చెల్లని ఓట్లుగా అధికారులు పరిగణిస్తున్నారు. కాగా నల్గొండ జిల్లా దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో.. వరంగల్, ఖమ్మం అలాగే నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.