బాబు ప్రభుత్వంలో.. జనసేనకు ఎన్ని మంత్రి పదవులంటే?
ఈ క్రమంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నిర్మించిన రాజధాని అమరావతిలోనే ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కీలకమైన పదవులు ఎవరికి దక్కబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కూటమి విజయం సాధించడంలో కీలకమైన పాత్ర వహించిన జనసేన అధినేతకు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. మరోవైపు జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన మరి కొంతమంది నేతలకు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయట. మొత్తంగా జనసేన పార్టీకి 6 మంత్రి పదవులను ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం ఏపీ రాజకీయాలలో నడుస్తుంది.
ప్రస్తుతం జనసేన చీప్ గా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మరో శాఖను కూడా కట్టబెట్టే అవకాశం ఉందట. అదే సమయంలో మరో ఐదుగురికి మంత్రి పదవులు దక్కుతాయట. మంత్రి పదవుల రేసులో ఇక జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు తోడు నీడగా నిలుస్తున్నా నాదెండ్ల మనోహర్ ఇక ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న కొణతాల రామకృష్ణ, కందుల వెంకటేష్, బుద్ధా ప్రసాద్, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ లు అటు మంత్రి పదవులు దక్కించుకునే వారి రేసులో మొదటి వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.