చంద్రబాబు టీం: సీబీఎన్ కేబినెట్‌లో రఘురామకృష్ణంరాజుకు ఊహించని పదవి..?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు 175 స్థానాలకు గాను 164 స్థానాలు గెలుచుకున్నారు ఇది ఒక అతిపెద్ద విజయం ఏపీలో ఇలాంటి ఘన విజయం ఏ కూటమి కూడా సాధించలేదు. గెలిచిన వారందరూ కూడా కనీవినీ ఎరుగని మెజార్టీ సాధించి ఆశ్చర్యపరిచారు. గెలిచిన వారిలో టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఒకరు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఆయన విజయం సాధించారు. దీనికి ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉన్నారు. కానీ అతను ఈసారి వైసీపీని వీడి టీడీపీలో చేరు
ఉండి ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి పీవీఎల్‌ నరసింహరాజు పోటీ చేశారు. మరో అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు కూడా టీడీపీలో ఉండి ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. వైసీపీ అభ్యర్థి నుంచి బలమైన పోటీ ఉన్నప్పటికీ, రఘు రామ కృష్ణంరాజు 56,777 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అతనికి మొత్తం 116,902 ఓట్లు వచ్చాయి.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 60,125 ఓట్లు రాగా, మరో అభ్యర్థికి 13,260 ఓట్లు వచ్చాయి. ఇంత పెద్ద విజయంతో, రఘురామకృష్ణంరాజు చాలా పాపులర్ అయిపోయారు.
అంత పెద్ద విజయం సాధించారు కాబట్టి రఘురామకృష్ణంరాజు చంద్రబాబు కేబినెట్‌లో ఆయన కచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం ఉందని చాలామంది అంచనా వేస్తున్నారు. రఘురామకృష్ణంరాజును ఏపీ స్పీకర్‌గా నియమించవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు rrr ని హోం మంత్రి కుర్చీలో కూర్చోబెట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. హోం మంత్రి పదవి రాష్ట్రంలో చాలా పెద్దది అని చెప్పుకోవచ్చు. ఆ పదవి ఈ వైసీపీ రెబల్ ఎంపీకి దక్కితే ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ప్రస్తుతం జనసేన నుంచి కూడా ఎంపీ పదవి ఆశిస్తున్నావా వారు చాలామంది ఉన్నారు. 21 మంది గెలిస్తే వారిలో ముగ్గురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్ ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: