భారత్: నెహ్రూ తర్వాత మళ్లీ అలాంటి ఘనత సాధించిన ఏకైక నేత మోదీనే..??

Suma Kallamadi
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. 60 ఏళ్ల తర్వాత ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జవహర్ లాల్ నెహ్రూ వరుసగా మూడుసార్లు భారతదేశానికి ప్రధాని అయ్యారు. ఇప్పుడు మళ్లీ మోదీ ఆ ఘనతను సాధించారు. ఎన్‌డీఏ అధిష్టానం మళ్లీ నరేంద్ర మోదీకే ప్రధానమంత్రి పదవిని ఇస్తానని ప్రకటించింది. 2014 నుంచి ప్రధానమంత్రి అవుతూ వస్తున్నారు మోదీ. సంపూర్ణ బలంతో జవహర్ లాల్ నెహ్రూ, మోదీ ఇద్దరూ కూడా మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. కాంగ్రెస్ లో అతిపెద్ద నేతలైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారు కూడా భారతదేశానికి మూడుసార్లు పీఎం గా పనిచేసిన దాఖలాలు లేవు.
భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మోదీకి ఒక్కరికే ఆ ఘనత సాధించడం సాధ్యమైంది. అటల్ బిహారీ వాజపేయి కూడా మూడుసార్లు మంత్రి అయ్యారు. 1996లో 13 రోజులు ప్రధానమంత్రి, 1998లో 13 నెలల ప్రధానమంత్రి, ఆ తర్వాత ఐదు నాలుగున్నర ఇల్లు పాటు ప్రధాన మంత్రిగా కొనసాగారు కానీ సంపూర్ణ ప్రధానమంత్రిగా ఆయన భారతదేశానికి వ్యవహరించలేదు. మోదీ మాత్రమే 15 ఏళ్ళు నిర్విరామంగా పీఎం గా పనిచేయనున్నారు. మోదీ పూర్తి మెజారిటీతో సొంతంగా గెలిచారు జవహర్లాల్ నెహ్రూ కూడా అలాగనే గెలిచారు వీరిద్దరు మాత్రమే ఇండియాకి మూడుసార్లు ప్రధానమంత్రి కాగలిగారు.
ఇకపోతే టీడీపీ కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 164 అసెంబ్లీ సీట్లు, 21 అసెంబ్లీ సీట్లు విన్ అయ్యారు. దాంతో చంద్రబాబు కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు. ఆయన ఎటువైపు జంప్ చేస్తే అదే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాగా బాబు మోదీకే తన మద్దతును తెలిపారు. దాంతో మోదీ మరోసారి పీఎం కావడం ఖాయం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: