తెలుగు దేశం పార్టీ కి గుంటూరు , విజయవాడ కంచుకోటలా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 వ సంవత్సరం విడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో టిడిపి పార్టీ కి గుంటూరు , విజయవాడ నుండి అద్భుతమైన అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలు దక్కాయి. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ డీలా పడిపోయి వైసిపి పార్టీ హవా ఫుల్ గా నడిచింది.
దానితో ఈ రెండు జిల్లాలలో వై సి పి పార్టీ కి అత్యధిక సీట్లు వస్తాయి , టీ డీ పీ కి రావు అని చాలా మంది అంచనా వేశారు. కాకపోతే వారి అంచనా పూర్తిగా తప్పు అయింది. వైసిపి రాష్ట్ర మంతటా తన హవాను చూపించినప్పటికీ , ఈ రెండు జిల్లాలలో మాత్రం టిడిపి దే హవా నడిచింది. చివరి వరకు నేక్ టు నెక్ ఫైట్ నడిచిన చాలా ప్రాంతాలలో కూడా టి డి పి అభ్యర్థులే నెగ్గారు. 2024 వ సంవత్సరం ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత కూడా గుంటూరు , విజయవాడలో టి డి పి బలం తగ్గిపోయింది. ఈ సారి వైసీపీ కే ఇక్కడి నుండి చాలా ఎక్కువ సీట్లు వస్తాయి అని కొంత మంది భావించారు.
కానీ ఆ ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇక మూడవ సారి కూడా ఇక్కడ టిడిపి కి సంబంధించిన లేదా కూటమి కి సంబంధించిన అభ్యర్థులే తమ జోష ను చూపించి అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అలాగే పార్లమెంట్ స్థానాలను కూడా ఈ రెండు జిల్లాలలో కూటమి అభ్యర్థుల ఎగరేసికెల్లారు. ఇక ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మూడు అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో కూడా గుంటూరు , విజయవాడ జిల్లాలలో టిడిపి తన ఫుల్ జోష్ ను పూర్తిగా చూపించింది. దానితో టీడీపీ కి ఈ రెండు జిల్లాలలో తిరుగులేకుండా పోతుంది.