టీడీపీ: ఆ నగరాల్లో పార్టీ పేరుతో రెండు సార్లు హ్యాట్రిక్..!
గత ఎన్నికలలో కూడా గుంటూరు, విజయవాడ వంటి నగరాలలో టిడిపి పార్టీ విజయాన్ని అందుకుంది. 2014, 2019, 2024 లో కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఈ మూడుసార్లు కూడా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీని కడుపులో పెట్టుకున్నారు. దానికి సాక్ష్యం తాజాగా జరిగిన పరిణామమే అని కూడా చెప్పవచ్చు. కేశినేని నాని తన వల్ల తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తన వల్లే రెండుసార్లు టిడిపి పార్టీ గెలిచిందని భావించారు.. తీరా చూస్తే అది తెలుగుదేశం పార్టీ గొప్పే తప్ప.. నాని గొప్ప కాదని కూడా తేలిపోయింది. హలో తెలుగుదేశం పార్టీ పేరుతో ఈ రెండు నగరాలు హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాయి..
కేశినేని చిన్నిని గెలిపించారు. అదే సందర్భంలో గుంటూరు గల్లా జయదేవ్ రెండుసార్లు గెలిచారు.. జగన్ ఒత్తిడి తట్టుకోలేక శాంతం రాజకీయం వదిలేసి పక్కకి వెళ్లిపోయినటువంటి సందర్భం.. అయితే అక్కడ వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ విజయాన్ని అందుకున్నారు.. తద్వారా వరుసగా మూడుసార్లు గుంటూరు , విజయవాడ వంటి ప్రాంతాలలో ఎంపీ సీట్లు కైవసం చేసుకున్నారు.