* చంద్రబాబు చూపు ఎవరివైపు
* మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు
* టెన్షన్లో టీడీపీ మాజీ మంత్రులు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కూటమికి భారీ విజయాన్ని ఏపీ ప్రజలు అందించారు. గత ప్రభుత్వం మీదున్న వ్యతిరేకతో లేదా సూపర్ సిక్స్ పధకాలకు ప్రజలు అట్ట్రాక్ట్ అయ్యారో తెలీదు కానీ వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం తమ కసి చూపించారు.చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఈనెల 12న జరపడానికి టిడిపి నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడు గారుతో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రులుగా ఎవరికి చోటు దక్కనున్నది అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. అయితే ఇప్పటికే చంద్రన్న బాబు క్యాబినెట్లో మంత్రులుగా చేసిన కొంతమంది పేర్లు పరిశీలన ఉన్నట్లు తెలుస్తుంది.వారిలోప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్, ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో నరేంద్ర మినహా మిగితా వారందరు మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. అయితే వీరందరికి అవకాశం ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాలి.అయితే గతంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా చేసిన వారిలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రతిపాటి పుల్లారావు ఒకరు. 2014ఎన్నికలలోటిడిపి నుంచి గెలిచిన పుల్లారావుకి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత అప్పగించారు. మరలా క్యాబినెట్ విస్తరణలో భాగంగా పుల్లారావుని పౌరసరఫరాల శాఖ మంత్రిగానియమించారు.
చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన పుల్లారావుకు క్యాబినెట్లో చోటు దొరికే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితేప్రస్తుత క్యాబినెట్లో చంద్రబాబు పుల్లారావు ఏ పదవి బాధ్యతలపై ఇస్తారో అనే అంశంపై నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.ప్రస్తుత ఎన్నికలలో టిడిపి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు వైసీపీ అభ్యర్థి కాబట్టి మనోహర్ నాయుడు పై 33 వేల పైచిలుకు ఓట్లతో మెజారిటీ సాధించారు.జగన్ ఓటమి పాలుకావడంపై మాజీ మంత్రి పుల్లారావు స్పందించి సొంత జిల్లాలోనే వైసీపీ కుదేలవడం ప్రజల తిరస్కారానికి తార్కాణమని చెబుతున్నారు. సీఎం జగన్ రెడ్డి ఓటమి ఒప్పుకోలు ప్రకటనలోనూ నిజాయతీ లేదన్నారు. అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లంటూ ఇంకా దొంగనాటకాలు ఆడుతున్నాడని ప్రత్తిపాటి విమర్శించారు. ప్రజలకు ఎందుకు నేలకేసి కొట్టారో అర్థం కానంత అమాయకుడా జగన్ అని ప్రశ్నించారు. చెడుపై ఎప్పటికీ మంచిదే విజయమని ప్రజలు మరోసారి నిరూపించారనని మాజీ మంత్రి పుల్లారావు అన్నారు.