బెడిసికొట్టిన మోడీ చరిష్మా... కారణం ఏమైయుంటుంది?
2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకువచ్చి ప్రధాని పదవికి ప్రమోట్ చేయగా భారీ విజయాన్ని నమోదు చేశారు. అక్కడినుండి దేశంలో మోడీ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ తర్వాత.. 2019లో జరిగిన ఎన్నికలలో కూడా మోడీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఎన్నికలకు వెళ్లగా భారీ విజయం దక్కించుకున్నారు. పాతికేళ్లకే మొత్తం ప్రత్యర్ధులను పడగొట్టారు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రధాని మోడీ ఫేమ్‌ను నమ్ముకునే బీజేపీ రాజకీయంగా దూసుకువెళ్లింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముగిసిన ఎన్నికల్లో 400 సీట్లను రాబట్టాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకొని బరిలో దిగగా దేశ ప్రజలు ఝలక్కిచ్చారు.
అవును, తాజా ఫలితంలో బీజేపీకి 300 సీట్లు కూడా దాటని పరిస్థితి. ఒంటరిగా 140, కూటమి కి 293 సీట్లు మాత్రమే దక్కాయి. మూడోసారి అయితే అధికారం దక్కింది కానీ, మోడీ ఫేమ్.. ఆయన హవా ఎక్కడా పెద్దగా కనిపించకపోవడం కొసమెరుపు. యూపీలో అయోధ్య రామమందిరాన్ని నిర్మించిన నియోజకవర్గం ఫైజాబాద్‌లోనే బీజేపీ భారీ మెజారిటీతో గెలిచి తీరాలి. కానీ, అక్కడ బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. ఈ తాజా పరిణామాలను గమనిస్తే.. మోడీ ఫేమ్, హవా ఈసారి ఎక్కడా కనబరచలేదు అనే విషయం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అయితే దానికి కారణాలు అనేకంగా ఉన్నాయి. మొదటినుండి పప్పు అనిపించుకున్న రాహుల్ గాంధీ ఈసారి హీరో అయ్యాడు. ఈసారి రాహుల్ జనాల్లోకి నేరుగా వెళ్లడం వలన చాలా లబ్ది పొందారు. ఇక మోడీ మత రాజకీయం ఎందుకో బెడిసి కొట్టింది. ఇలాంటి విషయాలను మోడీ బేరేజి వేసుకొని ముందుకు సాగితే బావుంటుంది.. లేదంటే నాలుగోసారి గెలవడం దాదాపుగా అసాధ్యంగా కనబడుతోంది.