జగన్పై సోషల్ మీడియాలో 'శుక్రవారం' మీమ్స్.. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో?
2014లో తమ పార్టీ నుంచి గెలిచిన 23 మందిని టీడీపీ అక్రమంగా, పశువుల సంతల్లో పశువులను కొన్నట్టు కొన్నారని వైసీపీ ఆరోపించేది. అందుకే దేవుడు 2019లో టీడీపీకి 23 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చాడని అంతా పేర్కొనే వారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 ఎమ్మెల్యేలు గెలిచారు. వైసీపీకి 11 మాత్రమే గెలిచారు. కూటమి ఎమ్మెల్యేల సంఖ్య 1+6+4 కలిపితే వచ్చే సంఖ్య కూడా 11 అవుతుంది. ఇదే కాకుండా వైసీపీ గతంలో 151 సీట్లు కాగా అటో ఇటో 1 ఎగిరి పోతుందనుకుంటే మధ్యలోని 5 ఎగిరిపోయిందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్ మొత్తం జగన్కు చక్కటి గిఫ్ట్ ఇచ్చారని, తమకు రూ.5 చొప్పున ఇవ్వలేదని 151 మధ్యలో 5 ఎగురగొట్టేశారని పేర్కొంటున్నారు. ఒక్క ఛాన్స్ అని జగన్ గత ఎన్నికల్లో అడిగారని, దీంతో ఆయనకు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చారని వ్యాఖ్యలు వస్తున్నాయి. చిరంజీవి జగన్కు గతంలో దండం పెట్టారని, అయితే ఆయన తమ్ముడు పవన్ వైసీపీకి పిండం పెట్టారని పేర్కొంటున్నారు. అన్న వస్తున్నాడు.. చంచల్ గూడ జైలుకు అని కూడా కామెంట్లు వస్తున్నాయి. ఇక అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. తనకు అసెంబ్లీ ఉందని, సీఎంగా బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. దీంతో ఇక నుంచి ఆయన ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిందేనని టీడీపీ, జనసేన శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.