ఇప్పటికే ఎన్నో సార్లు ముఖ్య మంత్రి గా పని చేసిన చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్య మంత్రి గా పని చేశారు . ఆ తర్వాత రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నే భారీ స్థానాలను దక్కించుకొని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రి గా కూడా పని చేశారు .
ఇక 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ చాలా తక్కువ స్థానాలను దక్కించుకుంది. ఇక వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని అధికారంలోకి వచ్చింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫలితాలు రెండు రోజుల క్రితమే వచ్చాయి. అందులో తెలుగు దేశం పార్టీ అద్భుతమైన అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది.
దానితో చంద్రబాబు నాయుడు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇకపోతే జనాలు అద్భుతమైన మెజారిటీని ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి సహాయపడినందుకుగాను చంద్రబాబు తాజాగా తన పార్టీ నేతలకు కొన్ని సూచనలు , సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రజలు ఇచ్చిన ఈ గెలుపును ఏ మాత్రం కూడా గొప్పగా తీసుకోకుండా , వారికి మంచి చేయడం కోసం మనం కృషి చేయాలి.
ఈ గెలుపు వల్ల గర్వం కాకుండా చిత్త శుద్ధి రావాలి. ఈ గెలుపును కేవలం ప్రజా సంక్షేమానికి తప్ప వేరే ఇతర పనులకు వాడవద్దు. ప్రజలను అభివృద్ధి చేయడానికి , వారు ఎంతగానో ఎదగడానికే మన గెలుపు దోహదపడాలి అని చంద్రబాబు తన పార్టీ నాయకులకు , కార్యకర్తలకు తెలియజేసినట్లు తెలుస్తోంది.