జనసేన : టీటీడీ బోర్డు చైర్మన్ గా మెగా బ్రదర్ ?
అలాగే తక్కువ సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్... కూటమి విజయానికి కారణమయ్యాడని ఇప్పటికే చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా... మోడీతో చంద్రబాబును కల్పించడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. దాదాపు 50 సీట్లలో పోటీ చేయాల్సిన జనసేన పార్టీ... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం... 21 స్థానాలు తీసుకొని... ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో...అని చేసి చూపించింది.తక్కువ సీట్లు తీసుకొని.. కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు... పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు అని చెప్పవచ్చు.
అయితే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని.. తన పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారట. కొత్తగా ఏర్పాటు అయ్యే మంత్రివర్గంలో... జనసేనకు ఆరు పదవులు వచ్చేలా చూస్తున్నారట. అలాగే తన అన్నయ్య నాగబాబుకు... టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబుకు చెప్పారట పవన్ కళ్యాణ్. పార్లమెంట్ సీటు నాగబాబుకు... ఇవ్వలేదు కనుక... పార్టీ కోసం కష్టపడ్డ ఆయనకు టిటిడి చైర్మన్ కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. గత పది సంవత్సరాలుగా.. తనతోనే ఉంటూ... జనసేన పార్టీకి ఆర్థికంగా సహాయం చేశారు నాగబాబు. నిత్యం పవన్ కళ్యాణ్ తో తిరుగుతూ... వైసీపీకి కౌంటర్ ఇస్తూనే వచ్చారు.