జగన్ కు టీడీపి పక్కా మాస్ వార్నింగ్ !

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చోటుచేసుకున్నాయి. మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... మంగళవారం రిలీజ్ అయ్యాయి. ఈ తరుణంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చేందుకు మెరుగైన మెజారిటీ సీట్లను సంపాదించుకుంది. గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనను వ్యతిరేకించిన ఏపీ ప్రజలు... తెలుగుదేశం కూటమికి అధికారాన్ని ఇచ్చారు. 2019 ఎన్నికలలో వైసిపి ఒంటరిగా సాధించిన సీట్ల కంటే... కూటమి పార్టీలు ఎక్కువ సీట్లు సాధించాయి.


 ఇక ఈ నెల 12వ తేదీన...  ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టబోతుంది. అయితే జూన్ 4వ తేదీన... ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత... తెలుగు తమ్ముళ్లు నాన రచ్చ చేయడం మొదలు పెట్టేశారు. వైసీపీ నేతలు ఎక్కడ కనబడితే అక్కడ దాడి చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డ తెలుగు తమ్ముళ్లు... ఇప్పుడు వారిని టార్గెట్ చేస్తున్నారు.మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజిని లాంటి నేతల ఇండ్లపై దాడులు కూడా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.


 దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వైసిపి కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్, నేతలపై జరుగుతున్న దాడులపై..  ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఐదు సంవత్సరాల పాటు శాంతి భద్రతలతో కాపాడిన ఆంధ్రప్రదేశ్ ను తెలుగుదేశం ముఠాలు... అస్తవ్యస్తం చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వెంటనే దీనిపై గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే...  వైసిపి కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.


 అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పోస్ట్ కు కౌంటర్ గా...  తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా... మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చురకలు అంటిస్తూ పోస్ట్ పెట్టింది టిడిపి. నువ్వు మారవు... నీ రాజకీయ బ్రతుకే ఫేక్ తో ముడిపడి ఉందంటూ మండిపడింది. దాడులు చేయాలనే ఆలోచనే మాకు ఉంటే, నువ్వు ఈ పోస్ట్ కూడా పెట్టే వాడివి కాదన్నారు. మీ నేతలు రాష్ట్రాలు, దేశాలు దాటి పారిపోయేవారు కాదు.
ఇప్పటికైనా నీ నీలి మందతో, నీలి వేషాలు వేయకుండా, హుందాగా రాజకీయం చేయి.. లేకపోతే నీకు ఆ పులివెందుల కూడా ప్రజలు మిగల్చరు అంటూ తెలుగుదేశం పార్టీ హెచ్చరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: