నారా లోకేష్: మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ గా నిలుపుతా..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలుపడ్డాయి.. ముఖ్యంగా టిడిపి జాతీయ కార్యదర్శిగా పేరుపొందిన నారా లోకేష్ గత ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఘోరమైన ఓటమిని చవి చూశారు. దీంతో ఎలాగైనా అక్కడే గెలవాలని ఈసారి ఎన్నికలలో కూడా పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. నిన్నటి రోజున తన భార్య నారా బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు లోకేష్.

అక్కడ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించి ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు కూడా పాల్గొనేలా చేశారు లోకేష్ అలా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి తనను 91 వేలకు పైగా మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మంగళగిరిలో 72 ఏళ్ల ఎన్నికల మెజారిటీ తీరగరాశారు. అందుకే ఇక్కడి ప్రజలకు తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడే చెబుతున్న మాట ఏమిటంటే అభివృద్ధిలో నెంబర్వన్ గా మంగళగిరిని నిలబెడతానని తెలియజేశారు నారా లోకేష్.

గతంలో చాలామంది నేతలు లోకేష్ ని సైతం విమర్శించారు. అలాంటి విమర్శలనుంచి పుట్టుకొచ్చిన నారా లోకేష్ తనని తానుగా మలుచుకొని భారీ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. అంతేకాకుండా కూటమిలో భాగంగా ఏకంగా 164 సీట్లను సైతం గెలుచుకోగలిగింది. మరి నారా లోకేష్ చెప్పిన విధంగానే మంగళగిరిని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతారా లేదా అనేది చూడాల్సి ఉన్నది. అలాగే టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిని అమలు చేస్తారా మళ్లీ ప్రజలను మోసం చేస్తారా అనే విషయాన్ని కూడా మరి కొద్ది రోజులలో తెలియబోతోంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో కీలకమైన నేతగా పేరు పొందిన పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చేల చూసుకుంటామంటూ మాట ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: