లోకేష్ ది లీడర్..లోక నాయకుడవుతాడా.?

Pandrala Sravanthi
- ఐటి మినిస్ట్రీ లోకేష్ ను వరిస్తుందా.?
- యువతకు రోల్ మోడల్ కాగలుగుతాడా.?
- మంగళగిరిని మార్చేస్తాడా .?

లోకేష్ టిడిపి జెండా వారసుడు. అలాంటి లోకేష్ మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. ప్రస్తుతం రాష్ట్రంలోని కీలక లీడర్లలో లోకేష్ కూడా ఒకరిగా మారాడు. అలాంటి లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా చక్రం తిప్పబోతున్నాడు. అభివృద్ధి కోసం ఎలా పాటుపడతాడు. రాబోయే రోజుల్లో టిడిపిని కాపాడతాడా.. మంగళగిరిని ఎలా తీర్చిదిద్దబోతున్నాడు వివరాలు చూద్దాం. ఒకప్పుడు లోకేష్ ను వైసిపి బ్యాచ్ పప్పు అని సంబోధించారు. అయినా సైలెంట్ గా ఉండి టైం కోసం ఎదురు చూశాడు. రెండుసార్లు మంగళగిరిలో ఓటమిపాలయ్యాడు. ఓటమి నుంచే పాఠం నేర్చుకున్న లోకేష్ ఎంతో కష్టపడి మంగళగిరిలో జెండా పాతాడు. అంతేకాదు యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టి ప్రతి గ్రామాన్ని తట్టాడు. చివరికి టిడిపిని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేశాడని చెప్పవచ్చు. అలాంటి లోకేష్ 2017 మార్చి 30న ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆ టైంలోనే మంత్రి పదవి కూడా చేపట్టారు. ఇక 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న లోకేష్ ఓడిపోయినప్పటి నుంచి మంగళగిరిలోనే ఉంటూ ప్రజలతో మమేకమై ఈసారి భారీ మెజారిటీ అందుకున్నారు. రాష్ట్రం దృష్టి మొత్తం తన వైపు తిప్పుకున్నాడు.

లోకేష్ బాధ్యతలు:
మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన లోకేష్ కు తప్పనిసరిగా క్యాబినెట్ లో మంత్రి పదవి రాబోతోంది.  అంతేకాకుండా తన తండ్రి నారా చంద్రబాబు తర్వాత  టిడిపిలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత లోకేష్ పైనే ఉంటుంది.  తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఏ విధంగా  అభివృద్ధి చేశారో , లోకేష్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేసే బాధ్యతలు ఉన్నాయి. అయితే ఆయనకు ఎంతో అనుభవం  ఉన్నటువంటి ఫీల్డ్ ఐటీ మినిస్టర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకడమే కాకుండా రాష్ట్రానికి ఎంతో పట్టు ఉంటుంది. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా అనేక ఐటీ కంపెనీలు తీసుకువచ్చి  అభివృద్ధి చేసే బాధ్యత ఆయనపై ఉంది. ఈ ఐదేళ్లలో మంగళగిరి అంటే లోకేష్, లోకేష్ అంటే మంగళగిరి అనే విధంగా తయారు చేస్తేనే ఆయనకు  భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. మంత్రి అయిన తర్వాత  తప్పనిసరిగా రాష్ట్రంలోని యువతను సక్రమ మార్గంలో తీసుకెళ్లి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే  దాంట్లో ముందుండాలి. యువతకు లోకేష్ ఒక ఇన్స్పిరేషన్ గా మారాలి. అలా అయితేనే రాబోవు కాలంలో టిడిపిలో లోకేష్  గట్టి లీడర్ కాగలుగుతాడు. ఆంధ్రప్రదేశ్ కు లోక నాయకుడు అవ్వగలుగుతాడని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: