ఆంధ్రప్రదేశ్ సిఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ నియామకం..!
నీరభ్ కుమార్ ప్రసాద్ సీనియర్ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయనను నియమించడానికి చంద్రబాబు ఎక్కువ మక్కువ చూపినట్టుగా తెలుస్తోంది. 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో కూడా చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. ఇప్పటివరకు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లడంతో ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ తక్షణమే బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు సమాచారం.
సిఎస్ జవహర్ రెడ్డి బదిలీ కావడంతో ఆయన నియామకం వెంటనే జరిగినట్లుగా తెలుస్తోంది.ఈనెల 12వ తేదీన జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా ఆయనే చూడవలసి ఉన్నది ఇప్పుడు ఆయన స్థానంలో ఈయన రావడంతో మరి ఎవరు చూస్తారు అనే విషయం పైన తెలియాల్సి ఉన్నది.. ముఖ్యంగా ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటి సంతకం వేటిమీద చేస్తారని విషయం పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జనసేన టిడిపి కూటమిగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టో పైన ప్రజలు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అలాగే మందుబాబులు కూడా తక్కువ ధరలకే బ్రాండెడ్ మందుని సరఫరా చేస్తామని చెప్పారు అలాగే మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, వాలంటరీలకు పదివేలు, ఉచిత బస్సు మరి ఇలాంటి వాటివన్నీటిపైన సైన్ పెడతారేమో చూడాలి.