అప్పుడు జగన్, ఇప్పుడు బాబు.. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేస్తున్నారా?
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అఖండ విజయం తర్వాత అధికారాన్ని చేపట్టబోతున్న కూటమి సైతం ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా దక్కించుకోకుండా దారుణమైన ఓటుకు చవిచూసిన వైసిపి పార్టీ నేతలపై ఇక టిడిపి శ్రేణులు దాడులు చేస్తున్న చూసి చూడనట్లుగానే ఉండబోతున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇలా ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరిని నామరూపాల్లేకుండా చేయాలని శాశ్వత వివాదాలను సృష్టించడం చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి చర్యలు కారణంగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం కాస్త రావణ కాష్టంగా మారి పోయే అవకాశం ఉందని.. ఒకప్పటి రాయలసీమ ఫ్యాక్షనిజాలు, బెజవాడా రౌడీయిజాలు మళ్లీ తెరమీదకి వచ్చే అవకాశం ఉందని ఇది రాష్ట్ర శాంతిభద్రతలకు ఏమాత్రం మంచిది కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అయినా శాశ్వత వివాదాలను సృష్టించడం మానేసి ఇక పార్టీ కార్యకర్తలు, నేతలను కంట్రోల్లో పెట్టుకుని పాలనను సాగిస్తే రానున్న రోజుల్లో అయినా రాష్ట్రంలో పరిస్థితి మారుతుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.