కోటంరెడ్డి, రఘురామ మాటలు వింటే వైసీపీ బాగుపడేదేమో?

Suma Kallamadi
ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అత్యంత దారుణంగా పరాజయం పాలవ్వడంతో పలువురు రాజకీయ విశ్లేషకులు వారి వారి మెదళ్ళకు పదును పెట్టడం మొదలు పెట్టేసారు. ఈ క్రమంలోనే ప్రజలు జగన్మీద వ్యతిరేకతతో ఇచ్చింది సైలెంట్ ఓటింగ్ కాదని, అదొక నిశబ్ద విప్లవమని అంటూ జగన్ తన టీమ్ ని అప్రమత్తం చేస్తున్నారు. జగన్ ప్రభత్వం ప్రత్యర్ధ పార్టీ కార్యకర్తలను భయం పెట్టిన మాదిరిగానే సామాన్య జనాలను కూడా భయపెట్టారని విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ముందు జనాలు భయపడ్డా ఆ తర్వాత భయపడకుండా ధైర్యంగా ఓటు వేసి జగన్ కు బుద్దొచ్చేలా చేసారని అంటున్నారు. ప్రజాస్వామ్యం గల ఈ దేశంలో ప్రజలే ప్రభువులు అన్న విషయాన్ని జగన్ విస్మరించాడని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కొంతమంది విశ్లేషకులు కోటంరెడ్డి, రఘురామ మాటలను గుర్తు చేస్తున్నారు. గతంలో వీరు ఇరువురూ వైసీపీ పార్టీ వ్యవహార శైలిపైన అనేక విమర్శలు చేయడం జరిగింది. అయితే వాటిని వైసీపీ అప్పట్లో చాలా తేలికగా తీసుకుంది. పైగా వారు అన్న మాటలకి వారిని మానసికంగా శారీరకంగా హింసిందింది కూడా. కానీ అదే సమయంలో వారు చేసిన తప్పులు వారు సమీక్షించుకుంటే ఇపుడు ఇలాంటి దుస్థితి వైసీపీకి వచ్చి ఉండేది కాదనేది వారి వాదన. విషయం ఏమిటంటే.. రఘురామ కృష్ణం రాజు మొదటి నుండి జగన్ కి సోషల్ ఇంజనీరింగ్ గురించి గుర్తు చేస్తూ ఉండేవాడు. కానీ వారు కిట్టక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని వారిని హింసించడం జరిగింది. కట్ చేస్తే నష్టపోయింది వైసీపీ పార్టీనే.
అదేవిధంగా కోటం రెడ్డి వైసీపీ నేతలు చేస్తున్న తప్పుల్ని వేలెత్తి చూపేవాడు. వాటిని వారు లైట్ తీసుకోవడం జరిగింది. కోటం రెడ్డి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వంటివి అస్సలు వద్దని, అలాంటి దుశ్చర్యలు తగదని వారించినా వైసీపీ కేడర్ ఉపేక్షించలేదు. వీరిద్దరి మాటలను వైసీపీ అధినేత విని ఉంటే ఇపుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు కాదు... సొంత వైసీపీ నాయకులే కొంతమంది ఇపుడు రియలైజ్ అవుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇపుడు రియలైజ్ అయ్యి ఏం లాభం అని జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: