ఏపీ: ఆ విషయం జగన్‌కి ముందే తెలుసు?
వైసీపీ ఓడిపోవడానికి ఆయన పక్కన ఉన్న వాళ్లే కారణం అంటూ చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే జగన్ ఏం చిన్న పిల్లోడు కాదు. వాళ్లు చెప్పే వీళ్లు చెప్పే మాటలు విని ఆయన పరిపాలనను సాగించరు. ఆయనకు నచ్చిన నైజంలోనే నడుస్తారు. ఉదాహరణకి సూపర్ సిక్స్ ప్రజల్లోకి బాగా వెళ్ళిపోతుందని కింద స్థాయి వాళ్లు చెప్తే జగన్ తేలికగా కొట్టి పారేశారట. ఆ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే ఇన్ని నిధులు కావాలి, అది అసాధ్యం అని జగనే కొన్ని లెక్కలు రాసుకొని ప్రజలకి వివరించారు. కానీ అంతకుమించి తాము సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పలేదు. అయితే జనం మాత్రం ఎవరు ఎక్కువ నిధులు ఇస్తారు? అనేది చూసుకుని ఓటు వేస్తారు. కానీ జగన్ మాత్రం తాను చెప్పింది ప్రజలు నమ్ముతారని విశ్వసించారు.
అలాగే టీడీపీ పార్టీ పెన్షన్లను నాలుగువేలు పెంచుతామని హామీ ఇచ్చింది జగన్ మాత్రం 3,000యే ఉంచుతామని అన్నారు. కింద స్థాయి వాళ్లు మాత్రం పెన్షనర్ల వయసును 50 ఏళ్లకు తగ్గించి 5,000 ఇస్తానని హామీ ఇవ్వాలంటూ సూచించారు. కానీ అది సాధ్యమయ్యేది కాదు అని, ఇలా అబద్ధం చెప్పి అధికారంలోకి రావడం సరికాదు అని జగన్ కరాకండిగా చెప్పేశారట. అందుకే అలాంటి హామీ చేయలేదు. "చంద్రబాబు అలాంటి హామీలు ఎన్ని ఇచ్చినా నెరవేర్చరు, ఆ విషయం ప్రజలకి కూడా తెలుసు. అందుకే అతనికి ఓటు వేయకుండా తనకే ఓటు వేస్తార"ని జగన్ అనుకున్నారు.
ఈ సంక్షేమ పథకాల వల్ల ఎదురుదెబ్బ తగులుతుందని ఆయనకు తెలుసు కానీ ప్రజలు తనకు తప్ప బాబుకు ఓటు వేయరనే అతి నమ్మకం ఆయనలో పాతుకుపోయింది. కానీ జనం మాత్రం జగన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వరు? ఆయన కూడా ఇస్తారు ఆయనకు ఓటు వేసి గెలిపించడం వల్ల తమకు ఎక్కువ సంక్షేమ పథకాలు అందుతాయి అని అనుకున్నారు. ఇక రాజధానిని కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల తల్లిదండ్రులు, నిరుద్యోగులు భయపడ్డారు. ఎందుకంటే తెలంగాణ వాళ్లు గ్రాడ్యుయేషన్ అయిపోగానే హాయిగా హైదరాబాద్ వెళుతున్నారు. అక్కడ కావాల్సిన ఉద్యోగం ఏదో ఒకటి దొరుకుతుంది. కానీ ఏపీ ప్రజలకు అలా లేదు వారు రాష్ట్రాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిందే. జగన్ ఉంటే రాజధాని రాదు అని వాళ్ళు సంక్షేమ పథకాలు అందజేసిన సరే ఓటు వేయలేదు.