ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి... ఏపీలో ఒకే ఒక పేరు వినిపిస్తోంది. ఇప్పటికీ అతని పేరు మారుమోగుతోంది. అతడే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ గురించి నిత్యం మాట్లాడుకుంటున్నారు జనాలు. ఎందుకంటే... పిఠాపురం నియోజకవర్గంలో... పవన్ కళ్యాణ్ గెలవడానికి చాలా కష్టపడ్డారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.
వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో వర్మ లేకపోతె పవన్ కళ్యాణ్ గెలుపు చాలా కష్టం అయ్యేది. అయితే అలాంటి పిఠాపురం వర్మపై దాడి జరిగింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో... పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పై దాడి జరిగింది. ఈ సంఘటనలో వర్మ కారుకు సంబంధించిన అద్దాలు పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది.
కొందరు గుర్తుతెలియని వ్యక్తులు... ఒక్కసారిగా ఆయన కారుపై దాడి చేసి... తప్పించుకున్నారు. అయితే ఈ దాడి వెనుక ఉన్నది జనసేన పార్టీ సైనికులు, జనసేన పార్టీ నాయకులు అని తెలుస్తోంది. వైసీపీ పార్టీ కూడా ఇదే ప్రచారాన్ని జోరుగా చేస్తోంది. అయితే ఈ వార్తలపై స్వయంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు.
తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జనసేన పార్టీలోకి 25 మంది వ్యక్తులు వెళ్లారు. అయితే ఆ వ్యక్తులు.. తనపై దాడి చేసినట్లు పిఠాపురం వర్మ స్పష్టం చేశారు.
కానీ జనసేన పార్టీకి అలాగే.. తనపై దాడి చేసిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని వర్మ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఆ 25 మంది జనసేన పార్టీలో ఉండటం గమనార్హం. సీసాలతో అలాగే ఇటుకలతో తన కారు పై దాడి చేశారని వర్మ ఫైర్ అయ్యారు. గతంలో హీరో సాయి ధరంతేజ్ పైన కూడా ఇదే తరహాలో దాడి చేశారని గుర్తు చేశారు వర్మ. ఈ నాయకులంతా వైసిపి ప్రోత్బలంతోనే దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే తాము రివర్స్ అటాక్ చేస్తామని హెచ్చరించారు వర్మ.