జగన్‌ ను దెబ్బకొట్టేందుకు మోడీ స్కెచ్‌..?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీకి దారుణమైన ఓటమి ఎదురైంది. గత ఎన్నికల్లో 151 స్థానాలు దక్కించుకున్న వైసీపీ పార్టీ... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది వైసిపి పార్టీ. అటు తెలుగుదేశం కూటమికి.. 164 స్థానాలు వచ్చాయి. ఇందులో బిజెపి కూడా ఎక్కువ స్థానాలు సంపాదించుకుంది.

అయితే.. రాయలసీమ  జిల్లాలలో బలంగా ఉన్న వైసిపి పార్టీ... అసలు అక్కడ దారుణంగా విఫలమైంది. 30 స్థానాలకు పైగా వైసిపి... రాయలసీమలో గెలవాల్సి ఉంది... కానీ రాయలసీమలో పట్టుమని 5 సీట్లు కూడా రాలేదు. రెడ్డిలు ఎక్కువగా ఉన్న రాయలసీమలో... వైసిపి పార్టీకి తీవ్రమైన దెబ్బ తగిలింది. అయితే..రాయలసీమలో... వైసిపి పార్టీని దెబ్బ కొట్టి బిజెపి ఎదగాలని చూస్తోందట. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుందట బిజెపి పార్టీ.

వాస్తవానికి... ఏపీలో బిజెపికి బలమే లేదు. కానీ కూటమి వల్ల ఎక్కువ సీట్లు సాధించగలిగింది బిజెపి పార్టీ. అయితే వైసిపి...  పార్టీకి అండగా నిలిచే రెడ్డిలను... తమ వైపునకు లాక్కునేందుకు... ఒక రెడ్డి నాయకున్ని బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా చేయాలని అనుకుంటుందట. ఇప్పటికే పురంధరేశ్వరిని ఏపీ అధ్యక్షరాలుగా చేసి సక్సెస్ అయింది బిజెపి. గతంలో కన్నా లక్ష్మీనారాయణ లాంటి కాపు నేతను  అధ్యక్షుడిగా చేసి విఫలమైన బిజెపి.... పురందరేశ్వరిని నియామకం చేసే  ఈ ఎన్నికల్లో సక్సెస్ అయింది.

అయితే మరో ఐదు సంవత్సరాల లో.. రాయలసీమలో పటిష్టంగా కావాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలను ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులుగా చేయాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే...  అవసరమైతే వైసీపీలో ఉన్న కీలక రెడ్డి లీడర్లను లాగేసుకొని వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకుంటుందట బిజెపి. ఏది ఏ మైనా వైసిపి  పార్టీని రాయలసీమలో దెబ్బ కొట్టాలని అనుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: