పేర్ని నాని మాస్ డైలాగ్స్..టీడీపీ అంతుచూస్తామని వార్నింగ్ ?
అరాచక మూకలను ఆపాలసిన పోలీసులు బెదిరిస్తున్నారని.... కౌంటింగ్ పూర్తి అవ్వక ముందే బందరు లో దాడులకు తెగ బడ్డారని నిప్పులు చెరిగారు. ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయటం లేదన్నారు. టీడీపీ నేతలు పోలీసులను పతనావస్థకు తెచ్చారని మండిపడ్డారు పేర్ని నాని. బరితెగించి మరీ దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార మదంతో టీడీపీ, జనసేన నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని.... 65 యేళ్ళ ముసలావిడ అని కూడా చూడకుండా ఆవిడని కొట్టి ఇంట్లో ఉన్న సామన్లన్ని బద్దలు కొట్టారని ఫైర్ అయ్యారు.
వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా పార్టీ తరఫున హైకోర్టుకి వెళ్లి ప్రైవేటు కేసులు వెయ్యబోతున్నామని... ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ధీమా కల్పించారు మాజీ మంత్రి పేర్ని నాని. గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళాం... ప్రజా తీర్పును శిరసా వహిస్తామని పేర్కొన్నారు. మా పార్టీ కార్యకర్తలు అందరికీ అండగా ఉంటా, రుణ పడి ఉంటామని పేర్నినాని వెల్లడించారు.