ఏపీ:వైసీపీ కంచుకోటలో చరిత్ర సృష్టించిన టిడిపి నేత..!

Divya
ఆంధ్రప్రదేశ్లో గత నెలలో జరిగిన ఎన్నికల ఓటింగ్ ఫలితాలు ఈ నెల నాలుగవ తేదీన విడుదలయ్యాయి ఇందులో కూటమి 164 స్థానాలకు ఘనవిజయం అందుకుంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది. అయితే ఇప్పటికే ఈ ఎన్నికల పైన చాలామంది గందరగోళంగా ఉన్నారు. ముఖ్యంగా చాలామంది నేతలు ఓడిపోవడంతో వైసిపి నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా వైసిపి కంచుకోట లో మా గుంటి శ్రీనివాసులు రెడ్డి ఒక చరిత్రను సైతం సృష్టించినట్లు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఎట్టకేలకు టిడిపి జెండా ఎగరవేసినట్లు తెలుస్తోంది.వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన ఈయన స్థానం మాత్రం పదిలంగానే ఉన్నది. వైసీపీ కంచుకోటలో పాతికేళ్ల తర్వాత మళ్లీ టిడిపి జెండా ఎగరవేశారు. తెలుగుదేశం పార్టీకి ఒంగోలు పార్లమెంటు స్థానం చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఎంపీగా పోటీ చేయడానికి ఇక్కడ ఏ అభ్యర్థి కూడా ముందుకి రాలేదట. ఇది ఈ ఒక్కసారే కాదు దాదాపుగా ప్రతి ఎన్నికలలో కూడా ఇదే తంతు కనిపిస్తూ వస్తోంది. టిడిపి ఆవిర్భావం నుంచి 2019 వరకు ఇక్కడ పదిసార్లు ఎన్నికలు జరగక కేవలం రెండుసార్లు మాత్రమే టిడిపి గెలిచింది.
టిడిపి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే అంతే సంగతులు అన్నట్టుగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి.అందుకే ఒంగోలు ఎంపీగా ఎవరు పోటీ చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో అప్పటికప్పుడు ఎవరో ఒకరిని పట్టుకొచ్చి ఎన్నికల బరిలో టిడిపి దింపుతూ ఉండేవారు. కానీ ఈసారి ఎన్నికలలో టిడిపి నుంచి పోటీ చేసిన మా గుంట శ్రీనివాసలు రెడ్డి పాతికేళ్ల తర్వాత ఒక చరిత్రను తిరగరాసి టిడిపి జెండాను ఒంగోలు పార్లమెంటులో ఎగరవేశారు. 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఒంగోలు పార్లమెంటు స్థానాలలో ఎన్నికలు జరగకగా కాంగ్రెస్ పార్టీ 10స్థానాలు ఇండిపెండెంట్ అభ్యర్థి రెండు స్థానాలు.. ఒకసారి సిపిఐ.. రెండుసార్లు టిడిపి.. రెండుసార్లు వైసిపి అభ్యర్థులు గెలిచారు. గతంలో ఎక్కువగా కాంగ్రెస్ హవా ఇక్కడ కనిపిస్తూ ఉండేది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: