రోజా సంచలన నిర్ణయం..ఇక ఏపీలో అడుగు పెట్టడం కష్టమే ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేసిన... వైసిపి పార్టీ దారుణంగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ పార్టీ.. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే వైసిపి పార్టీ పరిమితమైంది. అయితే వైసిపి అధికారంలో ఉన్న సమయంలో... తెలుగుదేశం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను... బండ బూతులు తిట్టిన చాలామంది నాయకులు ఓడిపోయారు.


అందులో ఆంధ్రప్రదేశ్ ఫైర్ బ్రాండ్, మాజీ ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా ఒకరు. నగరి నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన... మాజీ మంత్రి రోజా.. ఈసారి అత్యంత దారుణంగా ఓడిపోయింది. అందరూ ముందుగా చెప్పినట్లే... వైసీపీలో మొట్టమొదటిగా ఓడిపోయేది రోజానే అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే రోజానే మొదలు ఓడిపోయారు. నగరి నియోజకవర్గంలో... రోజా కుటుంబానికి చెందిన వ్యక్తులు... అత్యంత దారుణాలకు పాల్పడ్డారని స్వయంగా వైసిపి నేతలే ఆరోపణలు చేశారు.


అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి... గుడ్డిగా రోజమ్మకు సీటు ఇచ్చారు. కానీ నగరి నియోజకవర్గంలో అత్యంత దారుణంగా ఓడిపోయింది రోజా. ఇక రోజా ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవాల్సింది. కానీ... వైసీపీ నేతలే... ఏపీలో తెగ సంబరాలు చేసుకున్నారు. దరిద్రం పోయిందని...  టపాకులు కూడా పేల్చారు. ఇక ఇప్పుడు... రోజా ఏం చేయబోతుందని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచిస్తున్నారు.

 
 సినీ గ్లామర్ ఉన్న మాజీ మంత్రి రోజా... మళ్లీ జబర్దస్త్ షో కు వస్తుందా అని కొంతమంది చర్చిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... చెన్నైలో రోజా భర్తకు వ్యాపారాలు ఉన్నాయి. అక్కడ రోజా కుటుంబానికి ఆస్తులు కూడా ఉన్నాయి. దీంతో ఏపీ అలాగే తెలంగాణకు రాకుండా... చెన్నైలోనే సెటిల్ కావాలని అనుకుంటుందట రోజా. ఈ ఐదు సంవత్సరాల పాటు... ఎవరికి కనిపించకుండా... చెన్నైలో మకాం వేయాలని అనుకుంటుందట. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత వైసిపి గెలిస్తే... ఏపీకి రావాలని డిసైడ్ అయ్యారట. అప్పటివరకు... ఏపీకి దూరంగానే ఉండాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: