బాబు అలా చేస్తే మాత్రమే ప్రత్యేక హోదా.. ఈ ప్రయోజనాలను ఏపీ ప్రజలకు అందిస్తారా?
అయితే ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ 16 లోక్ సభ స్థానాలలో జనసేన 2 స్థానాలలో విజయం సాధించాయి. చంద్రబాబు తలచుకుంటే ప్రత్యేక హోదా సాధించడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. బాబు పట్టు పడితే మోదీ సైతం ప్రత్యేక హోదాకు అంగీకరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే మాత్రమే ఏపీ ప్రజలు ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
వెనుకబడిన రాష్ట్రమై జన సాంద్రత తక్కువగా ఉండి సరైన మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం ఇచ్చే నిధులలో ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో పాటు స్పెషల్ స్టేటస్ కలిగి ఉన్న రాష్ట్రాలు 90 శాతం గ్రాంట్లు, 10 శాతం రుణంగా పొందవచ్చు. స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలలో నెలకొల్పే పరిశ్రమలకు భారీగా రాయితీలు లభిస్తాయి.
చంద్రబాబు, పవన్ తలచుకుంటే మోదీని ప్రత్యేక హోదా విషయంలో ఒప్పించడం కష్టం కాదు. బాబు ప్రత్యేక హోదా సాధిసే మాత్రమే ఏపీ అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, పవన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు, పవన్ తలచుకుంటే లక్ష్యాన్ని సులువుగానే సాధిస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బాబు, పవన్ రాజకీయాల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.