అదిరిపోయే నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. తల పట్టుకుంటున్న జగన్..??

Suma Kallamadi
ఏపీ మాజీ సీఎం జగన్‌ బీసీలకు చాలా మేలు చేశారు. అనేక మంది బీసీలకు కింద స్థాయి నుంచి పదవులు ఇస్తూ వారికి రాజ్యాధికారం కట్టబెట్టారు. ఇంతవరకు ఏ సీఎం చేయని విధంగా వారికి పదవులు ఆర్థిక సహాయాలు అందించారు కానీ వారు మాత్రం ఓటు వేయకుండా దారుణంగా దెబ్బతీశారు. జగన్ ఎంత చేసినా వారు నమ్మలేదు. వారు మొదటి నుంచి నమ్మిన చంద్రబాబునే ఈసారి ఓట్లు వేశారు. చంద్రబాబుకు పెద్ద ఓటు బ్యాంకు బీసీ వాళ్లే అని చెప్పుకోవచ్చు. జగన్ ఆ ఓటు బ్యాంకును కొంచెం కూడా కదిలించలేకపోయారు.
అయితే అధికారంలోకి రాగానే చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పడానికి ఒక అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ రామ్ మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారట. వీరిలో ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారైతే మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. తనని గుండెల్లో పెట్టుకొని గెలిపించిన కమ్మ సామాజిక వర్గానికి, కష్ట సమయంలో అండగా నిలిచిన బీసీ సామాజిక వర్గానికి ఆయన ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.
రామ్ మోహన్ నాయుడును కేబినెట్ మంత్రిగా.. పెమ్మసాని చంద్రశేఖర్‌ను సహాయం మంత్రిగా చంద్రబాబు నియమించే అవకాశం ఉన్నట్లు ఈనాడు రాసుకొచ్చింది. దాంతో వీరు ఆ మంత్రులుగా ఎంపిక కావడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. తనవాళ్లను ఎప్పుడూ నెత్తిన పెట్టుకుంటానని ఈ నిర్ణయంతో ఆయన మరోసారి రుజువు చేయబోతున్నారు. దీనివల్ల బీసీ ఓటు బ్యాంక్ అనేది ఆయనకే ఎప్పటికీ ఉండిపోతుంది. జగన్‌కు మాత్రం షాక్ తగులుతుంది. ఈ విషయం తెలిస్తే ఆయన తల పట్టుకునే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: