ఆంధ్రప్రదేశ్‌లో భయానక అలజడి.. ఏదో పెద్ద కుట్ర జరగుతుందా..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెట్టేందుకు టీడీపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ అప్పుడే జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా వారి దృష్టి ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై పడింది. ఈ సంస్థ ఏపీలో ఖనిజ వనరులను అభివృద్ధి చేస్తుంది, ఖనిజ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది.
అయితే ఈ సంస్థ కార్యాలయాన్ని తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేసింది. శనివారం గనుల శాఖ డెరెక్టర్‌గా, ఎండీసీ ఎండీగా యువరాజ్ బాధ్యతలు స్వీకరించారు. కాగా శుక్రవారం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది.  గనుల శాఖ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు వైస్ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వెంకటరెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జూన్ 7న రాత్రి సమయంలో ప్రభుత్వం వెంకటరెడ్డిని బ‌దిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంట‌నే పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.
ఏపీ గవర్నమెంట్ జూన్ 7న ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలోని గ‌నుల‌శాఖ ఆఫీస్‌ను, తాడిగ‌డ‌ప దగ్గరలో ఉన్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి ఆఫీస్‌ను సీజ్‌ చేయగా.. పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం కీలకమైన ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర సమాచారం అక్కడ నుంచి ఎటూ కదలకుండా ఆఫీసులను స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వం మళ్లీ ఆదేశాలు ఇచ్చేంతవరకు ఆఫీసులు క్లోజ్ అయ్యే ఉంటాయి.
గడిచిన ఐదేళ్లలో బీచ్‌శాండ్‌, బెరైటీస్‌, ఇసుక, బొగ్గు, ఇతర ఖనిజాల వేలం, టెండర్లు, అమ్మకాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. వైసీపీ నేతలు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. వారికి వెంక‌ట‌రెడ్డి బాగా సహాయం చేశారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఆరోపణల మీద కేసులు ఫైల్ చేసి ఆయా నేతలను కోర్టులకు ఈడ్చే అవకాశం ఉంది. పోయినసారి వైసీపీ టీడీపీ వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టిందో అలానే టీడీపీ వైసీపీ వాళ్లను ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. మరోవైపు జనసేన కార్యకర్తలు ఏపీలో పెద్ద అలజడి సృష్టిస్తున్నారు. వైసీపీ పార్టీ కోసం బాగా పనిచేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ, జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య బాగానే గొడవలు జరుగుతున్నాయి. వీటిని తిప్పి కొట్టేందుకు వైసీపీ పెద్ద కుట్ర పన్నుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: