కేంద్రమంత్రి పెమ్మసాని ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
పెమ్మసాని చంద్రశేఖర్ ఆఫిడవిట్లో తెలిపిన ప్రకారం ఈయన విద్యార్హతలు..MD,MBBS అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఈయన భార్య పేరు శ్రీ రత్న కోనేరు ఈయన మొత్తం ఆస్తి విలువ..5,785 కోట్ల రూపాయల చరాస్తి విలువ.. రూ.5,598.65 కోట్ల రూపాయలు అన్నట్లుగా తెలియజేశారు.. ఈయన మీద కేసులు ఒకటి ఉన్నట్లుగా తెలుస్తోంది అప్పులు విషయానికి వస్తే.. రూ.1,038 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం.. ఈయన చేతిలో ఉన్న డబ్బు విషయానికి వస్తే రూ.2,06,400 రూపాయలు. ఇక బంగారం విషయానికి వస్తే..181 గ్రాములు.. తన భార్యకు 2,567,135 గ్రాముల బంగారం కలదు.
భారతదేశంలోని ఒక ఎంపీ అభ్యర్థిగా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తిగా పెమ్మసాని చంద్రశేఖర్ వార్తలలో నిలిచారు.గుంటూరు జిల్లా బుర్రెపాలానికి చెందిన ఈ పెమ్మసాని చంద్రశేఖర్ 1999 లో ఎంబిబిఎస్ ని పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ పెన్విలేనిలో 2005 లో పీజీ పూర్తి చేశారట ఇక ఈయన భార్య కూడా అమెరికాలో వైద్యురాలి ఇద్దరు కూడా అక్కడే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. యు వరల్డ్ అనే ఒక ఆన్ లైనింగ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ని మొదలుపెట్టారు పెమ్మసాని. ఈ సంస్థ ద్వారానే కాకుండా మెడికల్ నర్సింగ్ అకౌంటింగ్ ఫైనాన్స్ లీగల్ ఫార్మసీ తదితర రంగాలలో పరీక్షలకు ఆన్లైన్లో మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటారు. అలాగే అమెరికాలో 101 లిస్టెడ్ కంపెనీలో పెమ్మసాన్ని దంపతులు సుమారుగా 2500 కోట్లు షేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది