ఎవరికీ సాధ్యం కాని ఏకైక రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య..??
'తాతమ్మ కల' మూవీతో బాలకృష్ణ వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటికి 108 దిగ్విజయంగా పూర్తి చేసి 'NBK 109' కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అయితే ఇతర హీరోలతో పోలిస్తే బాలకృష్ణ ఓ విషయంలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. ఆయన ఇప్పటిదాకా ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కెమెరా ముందు కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ శ్లోకాలు, పద్యాలను అవలీలగా చెప్పగల ఏకైక నటుడు బాలయ్య. అంతేకాదు ఈ నందమూరి అందగాడు పౌరాణిక, సాంఘికం, జానపదం, సైన్స్‌ఫిక్షన్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసి ప్రతి కేటగిరీలో కూడా సక్సెస్ సాధించారు. ఆ రికార్డు సాధించడం ఒక్క బాలకృష్ణకే చెల్లింది. ఈ హీరోకి చెంఘీజ్‌ఖాన్, గోన గన్నారెడ్డి క్యారెక్టర్స్ ప్లే చేయాలనేది చిరకాల కోరికట.
ఇకపోతే ఒకే సంవత్సరంలో 8 సినిమాలతో బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ కొట్టి మరో రికార్డు నెలకొల్పారు బాలకృష్ణ. 1987లో బాలయ్య బాబు హీరోగా చేసిన 8 సినిమాలు విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‌గా నిలిచాయి. కోదండరామిరెడ్డి, బాలయ్య కాంబోలో ఏకంగా 13 సినిమాలొచ్చాయి. ఒకే హీరో, ఒకే డైరెక్టర్ కలిసి ఇన్ని సినిమాలు తీయడం తెలుగు సినిమా చరిత్రలో అరుదైన పరిణామం.
బాలకృష్ణ తెలుగులో ఎక్కువ సినిమాల్లో డ్యుయల్ రోల్స్ చేసిన హీరోగా కూడా ఓ రికార్డు క్రియేట్ చేశారు. పేరిటే ఉంది. ఈ హీరోలో ఇప్పటిదాకా 17 సినిమాల్లో డ్యుయల్ రోల్స్ పోషించి అదరగొట్టారు. పోషించారు. 'అధినాయకుడు' సినిమాలో ట్రిపుల్ రోల్స్‌లో అద్భుతంగా నటించి వావ్ అనిపించారు.
పూరీ జగన్నాథ్ తీసిన 'పైసా వసూల్' సినిమాలో 'మామా ఏక్ పెగ్ లా' పాట పాడి తనలో సింగర్ కూడా ఉన్నారని నిరూపించారు. భవిష్యత్‌లో ఆదిత్య 369 సీక్వెల్ 'ఆదిత్య 999' డైరెక్ట్ చేసే దర్శకుడుగా మారాలని కలలుకుంటున్నారు. మూవీ స్టోరీ కూడా సిద్ధమయ్యిందట.