టీడీపీ : ఎంత కసి ఉన్నా...అలా చేయడం తప్పు తమ్ముళ్లు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ పార్టీని ఓడించి... తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతుంది. అయితే ఎన్నికల ఫలితాలు విడుదలైన జూన్ 4వ తేదీ నుంచి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పరిస్థితులు అస్తవస్థమయ్యాయి. ఐదు సంవత్సరాలపాటు... జగన్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డవారు... రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా వైసిపి నేతలు, కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు... దాడులు చేస్తున్నారు.

వైసీపీ మాజీ మంత్రుల ఇండ్లపై కూడా అటాక్ చేస్తున్నారు. ఎక్కడ వైసిపి కార్యకర్తలు అలాగే నేతలు కనిపించిన... దాడులు చేస్తున్నారు. కార్లపై జగన్ ఫోటో ఉన్నా సరే... కారు అద్దాలు ధ్వంసం చేస్తున్నారు. ఇలా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయకముందే... దాడులకు తెగబడుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే నేతలు. అయితే తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో... ఓ సంఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

గతంలో నారా లోకేష్ కుటుంబాన్ని తిట్టిన... వైసిపి కార్యకర్త పాలేటి రాజు  ను టార్చర్ పెట్టారు తెలుగు తమ్ముళ్లు. అతని బట్టలు ఊడదీసి... రోడ్డుపై కూర్చోబెట్టి... నాన రచ్చ చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. మోకాళ్లపై నిలబెట్టి మరి దాడికి తెగబడ్డారు. చివరికి లోకేష్ కు  క్షమాపణలు చెప్పేలా... చిత్రహింసలు పెట్టారు. దీంతో... అరుస్తూ, గోడ గోడ ఏడుస్తూ... నారా లోకేష్ కు క్షమాపణలు చెప్పాడు రాజ్ కుమార్.  అయితే ఇలాంటి సంఘటనలను తెలుగుదేశం ప్రభుత్వం... అస్సలు ప్రోత్సహించకూడదు. ఏపీలో అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

కానీ వైసిపి నేతలపై ఇలా ప్రతి కారం పెట్టుకోవద్దు. గతంలో వైసీపీ నేతలు రచ్చ చేయవచ్చు... కానీ వాళ్ళలాగా తెలుగుదేశం పార్టీ నేతలు చేయకూడదు అని... ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతలను కాపాడాలని కోరుతున్నారు ప్రజలు. ఇలా శాంతి భద్రతలు దెబ్బతీస్తే... ఏపీ మరో బిహార్ అవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఓడిపోయిన వారిని.. వదిలేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అలాగే వైసిపి విధి విధానాలు అంటే తనకు వ్యతిరేకమని..  పర్సనల్గా జగన్ అంటే ఎలాంటి కోపం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా... ఇలాంటి దాడులను ఖండించి... ఏపీ అభివృద్ధి పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా...  కఠిన శిక్షలు వేసేలా నారా లోకేష్ చంద్రబాబు చూసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: