మోదీ కేంద్రమంత్రుల జాబితాలో ఒక్క ముస్లిం కూడా ఎందుకు లేరు..??
దేశంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్నప్పటికీ తన మంత్రివర్గంలో ముస్లిం మంత్రులెవరికీ మోదీ చోటు ఇవ్వలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ముస్లింలకు ప్రాతినిధ్యంగా కనీసం ఒక్క ముస్లిం నేతనైనా కేంద్ర మంత్రిగా ప్రకటించాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం అలా చేయలేదు కాబట్టి ముస్లిం ప్రజలలో ఆందోళన కలిగిందని తెలుస్తోంది.
అయితే దీనికి ఓ కారణం ఉందని కొంతమంది అంటున్నారు. వారి ప్రకారం దాదాపు 90% కంటే ఎక్కువ మంది INC/కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు, ఆ కోణంలో చూసుకుంటే దాదాపు ముస్లింలు బీజేపీ/NDAకి ఓటు వేయరు. బీజేపీకి ఆత్మగౌరవం ఉంది కాబట్టే ముస్లింలను మభ్యపెట్టే ప్రయత్నం చేయదట. గత 10 సంవత్సరాల బుజ్జగింపులు చేసింది కానీ ఇకపై ముస్లింల గురించి పట్టించుకోకూడదు అని బీజేపీ నిర్ణయించుకుందట.
పైన చెప్పే మాటలన్నీ కూడా కొందరు చెబుతున్న అభిప్రాయాలు మాత్రమే. బీజేపీ ముస్లిం నేతకు ఎందుకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వలేదనేది అందుబాటులో ఉన్న నేతలను బట్టి, సర్వీస్ ను బట్టి ఆధారపడి ఉంటుంది ఎవరి పట్ల భారత ప్రభుత్వం వివక్షత చూపించకపోవచ్చు. ఇకపోతే మోదీ భారతదేశాన్ని మరొక ఐదేళ్లపాటు పాలించనున్నారు. ఐదేళ్లలో ఇండియాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపడుతారో చూడాలి.