జగన్ పై అలాంటి ఫార్ములా ప్రయోగించిన నారా లోకేష్..??
తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని కార్యాలయాలను సీజ్ చేయాలని డైరెక్టర్ జనరల్ (డీజీ)కి సీఎం చంద్రబాబు చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులను సులువుగా గుర్తించవచ్చు, పోలీసు ఉన్నతాధికారులను సరిగ్గా విచారిస్తే ఆధారాలు దొరకడం కష్టమేమీ కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇదే కేసును ఉపయోగించుకుని BRS అగ్ర నాయకత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి కీలకమైన సాక్ష్యాలను సంపాదించారు.
తెలంగాణలో పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. త్వరలో రాజకీయ అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే వ్యూహం అమలవుతున్నట్లు కనిపిస్తోంది. ఘోర పరాజయం తర్వాత జగన్ మోహన్ రెడ్డికి అన్ని విధాలా కష్టాలు పెరుగుతున్నాయి. లోకేష్ రేవంత్ రెడ్డి ఫార్ములానే ఉపయోగించి జగన్ ను కటకటాల వెనక్కి నెట్టే పనిలో పడ్డారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. కేసీఆర్ ఓడిపోయాక కవితా జైలు పాలయ్యారు. ఆమెను ఇప్పటిదాకా విడిపించిన వారే లేరు.
కేసీఆర్ కూడా జైలుకు వెళ్లే లాగా ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది పోలీసు అధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. బ్రాంచ్ కూడా వ్యతిరేకంగా ఎవరైనా అధికారులు సాక్ష్యం చెబుతారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడమని చెప్పినా లోకేష్ మాత్రం వైసీపీపై ప్రతీకారం తీర్చుకునే లాగానే కనిపిస్తున్నారు.