చంద్రబాబు : ఏపీకి మళ్లీ అన్యాయమే చేస్తున్న మోడీ ?

Veldandi Saikiran
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే జూన్ 4వ తేదీన రిలీజ్ అయిన ఎన్నికల ఫలితాలలో... బిజెపి పార్టీ సొంతంగా అనుకున్న స్థాయిలో సీట్లను సంపాదించలేకపోయింది. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని పరిస్థితి. దీంతో తమ మిత్రపక్షాలు అయిన జెడియు, తెలుగుదేశం పార్టీల సహాయంతో కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది ఎన్ డి ఏ.

అయితే మోడీ మూడవసారి ప్రధాని కావడం వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఎంపీలతో సపోర్ట్ చేయడంతో... ఇది సాధ్యమైంది.  అంటే కేంద్రంలో నారా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారన్నమాట.  ఆయన పక్కకు జరిగితే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలడం గ్యారెంటీ. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. ప్రత్యేక హోదా, రాజధాని నిధులు,  పోలవరం కోసం ఎక్కువ స్థాయిలో నిధులు సంపాదించుకోవచ్చు అని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.

కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం.. ఏపీకి అన్యాయం చేసే లాగానే కనిపిస్తోంది. చంద్రబాబు ఎంత సపోర్ట్ ఇచ్చినా.. మోడీ ప్రభుత్వం మాత్రం ఏపీకి సహాయం... చేయకపోవచ్చు అని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కావాలని ఏపీ నుంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే... బీహార్ కు కావాలని నితీష్ కుమార్ పట్టు పట్టడం కాయం. అప్పుడు బీహార్, ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే... మోడీ సంత రాష్ట్రం అయిన గుజరాత్ కు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

కాబట్టి ఆ సాహసం మోడీ ప్రభుత్వం చేసే ఛాన్స్ లేదని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఇటు పోలవరం ప్రాజెక్టు పూర్తి  చేసుకుందామంటే.. ఒడిస్సా ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో చాలా కేసులు వేసింది ఒడిశా ప్రభుత్వం. అయితే ఇప్పుడు అక్కడ బిజెపి ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేయబోతుంది. నవీన్ పట్నాయక్ పోలవరంపై  వేసిన కేసులను వెనక్కి తీసుకుంటే... ఒడిస్సాలో  బిజెపి ప్రమాదంలో పడుతుంది.  కాబట్టి పోలవరం కూడా తొందరగా క్లియర్ అయ్యేలా కనిపించడం లేదు. ఇక కేవలం కొత్త రాజధాని కోసం ప్రత్యేక నిధులు మాత్రమే చంద్రబాబు ఆడుకోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: