చంద్రబాబు : 2019 ఘోర పరాజయం.. 2024 గ్రాండ్ విక్టరీ.. మధ్యలో ఎన్నో సవాళ్లు..?

Pulgam Srinivas
తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గురించి ఆయన రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయి ఎన్నో గొప్ప గొప్ప పథకాలను తీసుకువచ్చి ఆంధ్ర రాష్ట్రం ముందుకు పరిగెత్తే కార్యక్రమంలో తన వంతు కృషి చేశాడు. ఆ తర్వాత 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 వ సంవత్సరంలో మొదటిసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.

అందులో తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. దానితో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మూడవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇకపోతే 2019 నుండి 2024 వరకు చంద్రబాబు నాయుడు కు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి కేవలం 25 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి.

ఇది తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బగా, ఇంత తక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చాయి అంటే ఇప్పట్లో టీడీపీ పార్టీ పుంజుకోవడం కష్టమే అని ఎంతోమంది రాజకీయ వేత్తలు కూడా అంచనా వేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ వెనక్కు తగ్గలేదు. గెలిచిన 25 మందితో కథన రంగం లోకి దూకాడు. ఇక ఆ మధ్యలో ఆయనను జైల్లో పెట్టడం , ఆయన వయసుకు అది చాలా కోలుకోలేని దెబ్బగా చాలా మంది దానిని పరిగణించారు. కానీ దానిని కూడా ఆయన తట్టుకొని నిలబడ్డారు. ఇక 2024 ఎలక్షన్స్ అంతా కూడా ఈసారి కూడా టిడిపి కష్టమే అని అన్నారు.

కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ వెనక్కు తగ్గలేదు. తీరా రిజల్ట్ చూస్తే టిడిపి కి భారీ మొత్తంలో సీట్లు అలాగే దానితో పొత్తులో భాగంగా పోటీ చేసిన జనసేన, బిజెపికి కూడా భారీ సీట్లు వచ్చాయి. దానితో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆయన ప్రమాణస్వీకారం ఈ నెల 12 వ తేదీన జరగనుంది. ఇలా 2019 నుండి 2024 వరకు ఆయన ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మళ్ళీ చాలా బలంగా నిలబడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: