వైసీపీ: జగన్ కారణంగానే వైసీపీ ఓడిపోయింది ?
తిరువూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు.. వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని వెల్లడించారు. గత ఐదేళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు వైసిపి పాలనలో ఎమ్మెల్యే లుగా నెరవేర్చలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఎమ్మెల్యే హోదాలో మమ్మల్ని ముఖ్యమంత్రి జగన్ ను సైతం కలిసే అవకాశం రాలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి కి ఘోర పరాభవం కావడానికి ప్రధాన కారణం సలహాదారులేరరి..జగన్ ఐపాక్ ను నమ్ముకున్నారు, మమ్మల్ని దూరం చేసుకున్నారని ఆగ్రహించారు తిరువూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి.
నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేసినందుకు ఎప్పుడు ముందుంటాను....పామర్రు,తిరువూరు నియోజకవర్గాల్లో నన్ను నమ్ముకున్న నా వర్గం ఉందని చెప్పారు. వాళ్ళందరూ నా మాటగా కూటమికే పట్టం కట్టారు..వాళ్లకు నేను ఎల్లప్పుడూ అండగానే ఉంటానని వివరించారు. పార్టీకి వీచిన ఎదురు గాలిలో సైతం ప్రజల మద్దతుతో గెలిచాను.. అది నాపై ప్రజలకు ఉన్న అభిమానం అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుందని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
కట్టలేరు బ్రిడ్జి,నూతిపాడు ఎత్తిపోతల పథకం, కాలనీ ఇళ్లు వంటి వాటి గురించి అసెంబ్లీలో అనేక మార్లు విన్నవించానని... తిరువూరులో బహిరంగసభ పెట్టి హామీలు గుప్పించారు... వాటి అమలుకై వందలసార్లు తాడేపల్లి కార్యాలయానికి వెళ్ళానని గుర్తు చేశారు తిరువూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి. ఇదుగో అన్న, అదిగో ఇచ్చేస్తున్నాం అంటూ చెప్పడమే కానీ ఏనాడు ఒక్క పైసా ఇచ్చిన సందర్భం లేదని ఫైర్‌అయ్యారు. నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టడం వలన నేడు వైసీపీ కి ఈ గతి పట్టిందని తెలిపారు.