చంద్రబాబు వార్నింగ్ : తప్పు చేసిన జగన్ ను విడిచిపెట్టను ?
అందరి సహకారంతో రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని... రేపు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా వివిధ ఎన్డీఏ పక్షాల నేతలు వస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చేందుకు మోదీ, అమీత్షా అంగీకరించారని.... మనకు లభించింది విజయం కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని వివరించారు. పేద ప్రజల జీవితాలు మార్చే దిశగా కృషి చేసి వారికి మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు.
శిథిలమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టుకుందామన్నారు. ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతాననే శపధాన్ని ప్రజలు గౌరవించారన్నారు. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. పోలవరం పూర్తితో పాటు నదుల అనుసంధానం చేస్తే ప్రతీ ఏకరాకు నీరివ్వొచ్చు...పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతీ ఒక్కరం కృషి చేద్దామని కోరారు చంద్రబాబు. అమరావతి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని ప్రకటించారు.
ప్రజావేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని... జగన్ చెప్పిన విశాఖ రాజధాని ప్రతిపాదనలు అక్కడి ప్రజలు నమ్మలేదని వెల్లడించారు. విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోబోమని... విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారని వివరించారు. కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం.... సీఎం కూడా మామూలు మనిషేనని వివరించారు. సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండదని స్పష్టం చేశారు.