ఏపీ: మొన్నటివరకూ బాబుని పట్టించుకోని మోడీ ఇపుడు వదలట్లేదెందుకని?
ఇకపోతే ఈ ఇద్దరిలో చంద్రబాబు, నితీష్‌లలో మోడీకి అత్యంత నమ్మకస్తుడు చంద్రబాబే. ఎందుకంటే నితీష్ మీద అవకాశవాది ముద్ర ఉందనే ఉంది. ఎందుకంటే గతంలో మనోడు బీజేపీతో కలిసి ఉండి.. తర్వాత వదిలి ఇపుడు మళ్లీ కలిశారు. ఇలా.. గడిచిన 4 సంవత్సరాల్లో 2 సార్లు బీజేపీతో కాపురం చేయడం.. రెండుసార్లు వదిలేయడం అందరికీ తెలిసిందే. దాంతో ఇప్పుడు కూడా ఆయనపై మోడీకి పెద్దగా నమ్మకాలు లేవనే గుసగుసలు బీజేపీ వర్గాల్లో వినబడుతున్నాయి. దాంతో నితీష్ గత చరిత్ర కారణంగా ఏమైనా జరగొచ్చనే వాదన జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది. మరోవైపు నాయకుడు నితీష్‌కు ప్రదాన మంత్రి పదవిని ఇచ్చేందుకు.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి యత్నించినప్పటికీ తామే వద్దన్నామని చెప్పుకొచ్చారు. అయితే, దీనిని కాంగ్రెస్ ఖండించినా.. ఏమో తెరవెనుక ఏం జరిగిందో అనే చర్చ అయితే కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే మోడీ చంద్రబాబుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని జాతీయ మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి. నితీష్‌ను నమ్ముకుంటే.. నిండా మునుగుతామని మోడీకి ఆల్రెడీ అర్ధం అయిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. నితీష్ మోడీకి హేండ్ ఇచ్చినా నష్టంలేదు. రేపు నితీష్ కాదన్నా.. లేదంటే వేరే పార్టీని చేర్చుకున్నా బాబు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని బీజేపీ నాయకులు విశ్లేషించుకుంటున్నారు. అందుకే మోడీ చంద్రబాబుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది.