కెసిఆర్ కు షాక్.. విద్యుత్ కేసులో నోటీసులు..!
దీంతో జులై 30వ తేదీ వరకు విచారణ ఇచ్చేందుకు సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ పలు రకాల ఆరోపణలు చేశారు.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల పైన ఎక్కువగా దృష్టి పెట్టామని అసెంబ్లీ సమావేశాలలో విద్యుత్ కొనుగోలు పైన కూడా శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసిందని తెలియజేస్తోంది. విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో చాలా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో పలు రకాల ఆరోపణలు సైతం చేశారు.
దీంతో ఈ విచారణ పైన ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం అటు బిఆర్ఎస్ నేతలను సైతం కాస్త ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది.. అయినప్పటికీ కెసిఆర్ కూడా తన ప్రణాళికలను వచ్చే ఎన్నికలలో ఎలా గెలవాలని విషయం పైన కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో భారీగా ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బిజెపి పార్టీలు 8 స్థానాలు చొప్పున గెలిచాయి. ముఖ్యంగా కేసీఆర్ తన సొంత జిల్లా మెదక్ లో కూడా కలిసి రాలేదు. అటు ఎన్నికలు ఇటు కేసులతో చాలా ఇబ్బంది పడుతున్నారు కేసీఆర్.