టీడీపీ : బుచ్చయ్య, అయ్యన్న మధ్య తీవ్ర పోటీ ?
అంతేకాదు... జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే జనసేన పార్టీకి... మొత్తం మూడు మంత్రు పదవులు రాబోతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీకి ఒక్కటంటే ఒక్కటి మంత్రి పదవి వచ్చింది. ఇక ఓవరాల్ గా.... ముగ్గురు మహిళలకు కేబినెట్లో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు చర్చ అంతా... ప్రోటం స్పీకర్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది.
ఇవాళ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండగా... ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండనున్నాయి. దాదాపు నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలుగా అందరూ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇలాంటి నేపథ్యంలో ప్రోటం స్పీకర్ గా ఎవరు ఎంపిక అవుతారని అందరూ చర్చించుకుంటున్నారు. ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి అవకాశం ఉంటుంది.
ఈ లెక్కన చంద్రబాబు నాయుడు 9సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు అవకాశం రాదు. ఇక అయ్యన్నపాత్రుడు, లేదా బుచ్చయ్య చౌదరి ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం రానుంది. ఈ ఇద్దరు శాసనసభ్యులు ఏడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీనియారిటీ ప్రకారం... బుచ్చయ్య చౌదరికి ప్రొటెమ్ స్పీకర్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా చంద్రబాబు కేబినెట్లో... బుచ్చయ్య చౌదరి అలాగే అయ్యన్నపాత్రుడికి అవకాశమే లేదు.