కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు భారీ స్కెచ్?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి  వచ్చేసింది. ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన... జగన్మోహన్ రెడ్డిని  దారుణంగా ఓడించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టిన చంద్రబాబు... ఇక ఇప్పుడు... జగన్మోహన్ రెడ్డి మిత్రుడు కేసీఆర్ను దెబ్బకొట్టేందుకు సిద్ధం అవుతున్నారట. ఇందులో భాగంగానే... కసరత్తు కూడా మొదలుపెట్టారట చంద్రబాబు నాయుడు.


 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత... తెలుగుదేశం పార్టీని  కతం చేశారు కేసీఆర్. తెలంగాణలో ఉన్న టిడిపి నాయకులు అందరిని... గులాబీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారు. దీంతో తెలుగుదేశం ఓటు బ్యాంకు మొత్తం గులాబీ పార్టీకి మళ్ళీ పోయింది. అయితే...ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుగుదేశం నుంచి గులాబీ పార్టీలోకి వెళ్లిన నాయకులు అందరిని మళ్లీ వెనక్కి తీసుకువచ్చేందుకు... రంగం సిద్ధం చేస్తున్నారట.

 
 ఇందుకోసం మాజీ మంత్రి మల్లారెడ్డి వాడుకుంటున్నారట చంద్రబాబు. మల్లారెడ్డిని తెలంగాణ  తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చేసి... చక్రం తిప్పేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారట.  గులాబీ పార్టీలో ఉన్న... తలసాని శ్రీనివాస్ యాదవ్, అరికెపూడి గాంధీ , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి  పాత తెలుగు తమ్ముళ్లను... తీసుకువచ్చేందుకు మల్లారెడ్డికి బాధ్యతలు ఇచ్చారట చంద్రబాబు.

ఇక చంద్రబాబు ఆదేశాల మేరకు... మల్లారెడ్డి సైలెంట్ గా తన పని చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్రకు చెందిన పార్టీలను... తెలంగాణ బిడ్డలు నమ్మే పరిస్థితిలో లేరు. అది కలవని పని కూడా. చంద్రబాబు కాదు రాజశేఖర్ రెడ్డి వచ్చినా కూడా... తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన వారికి అస్సలు ప్రాధాన్యత  రాదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రత్యేక ఉదాహరణ వైఎస్ షర్మిల. రాజన్న రాజ్యం తీసుకువస్తానని ఏపీకి వెళ్లిపోయింది షర్మిల.  ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని స్కెచ్ లు వేసిన తెలంగాణలో బాగా వేయడం కష్టమే అని చెబుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: