మరోసారి అన్నపై అభిమానాన్ని చాటుకున్నా పవన్..!

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ , టి డి పి మరియు బి జె పి లతో పాటు పొత్తులో భాగంగా బరిలోకి దిగింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ , 2 పార్లమెంటు స్థానాలను తీసుకుంది. మే 13 వ తేదీన అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల అయ్యాయి. ఈ ఫలితాలలో జనసేన కు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది.

ఈ పార్టీ పోటీ చేసిన 21 స్థానాలలో 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాలలో రెండింటిలో కూడా గెలిచింది. ఇలా అద్భుతమైన విక్టరీని పవన్ పార్టీ సాధించింది. ఇక పవన్ అద్భుతమైన విజయం సాధించడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , టీడీపీ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి మోడీ గారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇక నేరుగా తన తల్లి , తన సోదరుడు చిరంజీవి , తన కుటుంబ సభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు.

ఇకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తో పాటు మంత్రి గా పని చేయబోతున్న పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ ప్రమాణ స్వీకార వేడుకనుకు పవన్ సోదరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా విచ్చేశారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కేరింతలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ప్రమాణ స్వీకారం అనంతరం అందరి ఆశీర్వాదం తీసుకున్న పవన్ ముఖ్యంగా తన అన్న అయినటువంటి చిరంజీవి దగ్గరకు వచ్చే సరికి మరింత ఎమోషనల్ అయ్యాడు. తనను కౌగిలించుకొని , కాళ్లు మొక్కి మరి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: