పవన్ ప్రమాణ స్వీకారం చూసి చిరు కళ్లలో ఆనంద భాష్పాలు.. ఉప్పొంగిపోతూ!
పవన్ కు గడచిన పదేళ్ల సమయంలో మెగా ఫ్యామిలీ చాలా సపోర్ట్ గా నిలిచింది. ఆయన సక్సెస్ లో వీళ్ళ పాత్ర కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. జూన్ 4 దాకా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్యే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇటీవల కాలంలో చిరంజీవి లాంటి ఎంతోమంది నటులు రాజకీయాల్లో అడుగుపెట్టారు కానీ పవన్ కళ్యాణ్ వలె పదేళ్లపాటు భీకరమైన పోరాటం చేసిన వారు చాలా అరుదు.
ఎంతోమంది ఈ రాజకీయాలు మనకు సెట్ కావు అని తప్పుకున్నారు. కానీ పవన్ మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా ఏపీ ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోనే కొనసాగారు. చివరికి డిప్యూటీ సీఎం అయ్యే అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక జనసైనికులు చాలా సంతోషపడుతున్నారు.
ఎన్డీయే కూటమి ఏపీలో అఖండ విజయం సాధించడంలో పవన్ కీలకంగా వ్యవహరించారు. ఆ కారణంగానే ముఖ్యమంత్రి తర్వాత మళ్లీ అంతటి హోదా ఉన్న డిప్యూటీ సీఎం పదవిని చంద్రబాబు పవన్‌కే కట్టబెట్టారు. అంతేకాదు ఏపీ కేబినెట్లో ముగ్గురు జనసేన నేతలకు చోటు కల్పించారు. మరి పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలు ఇచ్చిన విజయాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.